Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:48 PM
ఈ ప్రపంచంలో ఎంతో మంది కుక్కలను పెంచుకుంటారు. వాటి పోషణ కోసం ఆహారం పెడతారు. కొందరు అతి ప్రేమతో పెంపుడు కుక్కకు నచ్చినవన్నీ పెట్టేస్తుంటారు. అలాగే పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రపంచంలో ఎంతో మంది కుక్కలను (Dogs) పెంచుకుంటారు. వాటి పోషణ కోసం ఆహారం పెడతారు. కొందరు అతి ప్రేమతో పెంపుడు కుక్కకు (Pet Dog) నచ్చినవన్నీ పెట్టేస్తుంటారు. అలాగే పెంపుడు కుక్కకు అతిగా ఆహారం (Food) పెట్టినందుకు న్యూజిలాండ్ (New Zealand)కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పెంపుడు కుక్కుకు అతిగా ఆహారం తినిపించినందుకు ఓ మహిళకు న్యాయస్థానం రెండు నెలల జైలు శిక్ష విధించింది. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఆ కుక్క మరణించింది (Viral News).
న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. దానికి నుగ్గీ అని పేరు పెట్టి దానిని తన ఇంట్లో మనిషిలా చూసుకుంటూ వచ్చింది. ప్రతిరోజూ 8 నుంచి 10 చికెన్ ముక్కలు తినిపించేది. దీంతో ఆ కుక్క కొద్ది రోజుల్లోనే విపరీతంగా బరువు పెరిగిపోయింది. 53.7 కిలోల వరకు బరువు పెరిగిన ఆ కుక్క 10 మీటర్లు నడవడానికే చాలా ఆయాసపడిపోయేది. జంతు నియంత్రణ అధికారులు అక్టోబర్ 2021లో ఆ కుక్కను స్వాధీనం చేసుకొని అక్లాండ్ జంతు ఆశ్రయానికి తరలించారు. అక్కడ దాని కొవ్వును కరిగించేందుకు చికిత్స ప్రారంభించారు.
వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆ కుక్క బరువును 8.8 కిలోల వరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ ఆ కుక్క చనిపోయింది. దీంతో సదరు మహిళపై జంతు నియంత్రణ అధికారులు కేసు పెట్టారు. ఆ కేసును విచారించిన న్యాయస్థానం సదరు మహిళకు రెండు నెలల జైలు శిక్ష విధించింది. రూ.60 వేల జరిమానా విధించింది. సంవత్సరం పాటు ఆమె ఎలాంటి జంతువులను పెంచుకోకూడదని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.