Share News

Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:35 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?..  ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..
Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొన్ని గొడుగులు ఉన్నాయి. వివిధ వరుసల్లో ఉన్న గొడుగులు అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. అయితే వాటిల్లో ఒక్క గొడుగు మాత్రం భిన్నంగా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ భిన్నమైన గొడుగు ఎక్కడుందో కనిపెట్టడం కష్టం. 8 సెకెన్ల వ్యవధిలో ఆ గొడుగును కనిపెడితే మీ కళ్ల సామర్థ్యం బాగా ఉన్నట్టు లెక్క. చాలా తక్కువ మందే 8 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో భిన్నమైన గొడుగు ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..


Viral: ఏడాదికి రూ.30 లక్షల జీతం ఉండాలి.. పేరెంట్స్ ఉండకూడదు.. ఓ వధువు పెట్టిన కండిషన్లు వింటే కళ్లు తేలెయ్యాల్సిందే..


Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 09:35 AM