Share News

Optical Illusion: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 10 సెకెన్లలో పట్టుకోండి..

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:41 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 10 సెకెన్లలో పట్టుకోండి..
Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ పార్క్ కనబడుతోంది. ఆ పార్క్‌లో చాలా మంది పెద్దలు, పిల్లలు ఉన్నారు. కొందరు బెంచీల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు వాకింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోలో రకరకాల జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. అయితే ఆ పార్క్‌లో ఓ చోట ఓ కుక్క పిల్ల దాక్కుని ఉంది. ఆ కుక్క పిల్లను కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 7 సెకెన్ల వ్యవధిలో ఆ కుక్కను కనిపెడితే మీవి డేగ కళ్లు అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పార్క్‌లో కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది.

puzzle2.jpg

Updated Date - Oct 11 , 2024 | 03:42 PM