Viral News: చెత్తలో దొరికింది.. ఖరీదు రూ.55 కోట్లు
ABN , Publish Date - Oct 02 , 2024 | 10:47 AM
రోస్సో అనే వ్యక్తి 1962లో ఇటలీలోని కాప్రిలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా అతనికి ఓ పెయింటింగ్ దొరికింది. దాని ఖరీదు రూ.55 కోట్లు..
ఇంటర్నెట్ డెస్క్: ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పనికి రాని వస్తువులను పడేస్తున్నారా. అయితే వాటిని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే వాటిలో అమూల్యమైనవి ఉండొచ్చు. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే వస్తువులు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటలీలో జరిగిన ఓ సంఘటన వివరాలు తెలుసుకుంటే షాక్ అవుతారు. రోస్సో అనే వ్యక్తి 1962లో ఇటలీలోని కాప్రిలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా అతనికి ఓ పెయింటింగ్ దొరికింది. దాన్ని రోస్సో తన ఇంట్లో గోడకు వేలాడదీశాడు. తరువాత వారి కుటుంబం పాంపీకి మకాం మార్చింది.
అయితే ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలో ఆ పెయింటింగ్‌ను కొత్తింటికి తీసుకెళ్లాలని రోస్సో అనుకుంటాడు. అందుకు అతని భార్య తిరస్కరించింది. ఎలాగోలా పాంపీకి తీసుకెళ్తారు. ఆ పెయింటింగ్‌ను క్షుణ్నంగా పరిశీలించిన వారికి.. దాని పై భాగాన ఎడమ వైపులో పికాసో పేరు ఉంటుంది. అయితే ఆ పేరు ఎవరిదో కుటుంబ సభ్యులకు తెలియలేదు. దాంతో రోస్సో తన గదిలో ఓ చోట ఆ పెయింటింగ్‌ను ఉంచాడు. కొన్ని సంవత్సరాల తరువాత రోస్సో కుమారుడు ఆండ్రియా... ఆర్ట్ హిస్టరీ ఎన్సైక్లోపీడియాను అధ్యయనం చేశాడు. ఇంట్లో ఉన్న ఆ పెయింటింగ్ గురించి తన తండ్రిని అడిగాడు. పెయింటింగ్ వెనుక ఉన్న కళాకారుడు ఎవరో కనుక్కోవాలని అధ్యయనం ప్రారంభించారు.
నచ్చక వదిలించుకోవాలనుకుంటే..
అతని తండ్రి రోస్సో మరణించిన తర్వాత కూడా ఆండ్రియా తన రిసర్చ్‌ను వదిలిపెట్టలేదు. చివరికి ప్రసిద్ధ ఆర్ట్ డిటెక్టివ్ మౌరిజియో సెరాసిని నిపుణుల బృందం సలహాను కోరాడు. ఆర్కాడియా ఫౌండేషన్ గ్రాఫాలజిస్ట్, సైంటిఫిక్ కమిటీ సభ్యుడు సిన్జియా అల్టియెరి ఏళ్లపాటు అధ్యయనం చేసి ఆ పెయింట్ ప్రసిద్ధ పికాసో కళాఖండమేనని కనిపెట్టాడు. ప్రస్తుతం దాని విలువ భారత కరెన్సీలో రూ.55 కోట్లని తేలింది. పెయింటింగ్ తన తల్లికి నచ్చకపోవడంతో దాన్ని పడేయాలని చాలా సార్లు అనుకున్నామని ఆండ్రియా అన్నాడు. ప్రస్తుతం పెయింటింగ్‌ను ఓ లాకర్లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్‌తో మాట్లాడుతున్నామని చెప్పాడు. అలా.. రాత్రికి రాత్రే వాళ్లకు అదృష్టం తలుపుతట్టిందనమాట.
ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..
ఇదికూడా చదవండి: రేవంత్ సర్కారు.. ఇక ఇంటికే
ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు
ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి
Read Latest Telangana News and National News