Parenting: మీ పిల్లలకు పొరపాటున కూడా వీటిని కొనివ్వకండి..
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:35 PM
పిల్లలు అడిగింది ఏదీ కాదనలేరు తల్లిదండ్రులు. పిల్లల ఏడుపు చూడలేక కష్టం అయినా కొన్ని కొనిస్తుంటారు. కానీ ఈ వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొనివ్వకూడదు.
పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్లు అడిగినవి కొనివ్వకుంటే ఏడుస్తారు, మారం చేస్తారు, మొండి చేస్తారు. ఈకాలం తల్లిదండ్రులు పిల్లల ఏడుపు చూసి భరించలేక వాళ్లు అడిగినవి తీసిస్తే ఈ గోల తప్పుతుంది కదా అనే ఆలోచనతో కొనేస్తుంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లల కోసం కొనే చాలా వస్తువులు పిల్లలకు హాని చేస్తాయి. కొన్ని మానసికంగా ప్రభావం చూపిస్తే.. మరికొన్ని శారీరకంగా హాని కలిగించేవి గా ఉంటాయి. కొన్ని వస్తువులు ఊహించని విధంగా పిల్లలకు హాని చేస్తాయి. పొరపాటున వాటిని కొనివ్వకూడదని పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
Blueberry Vs Amla: బ్లూ బెర్రీ లేదా ఉసిరి.. చర్మ ఆరోగ్యానికి ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది..
మార్కెట్లో చౌకగా దొరికే ప్లాస్టిక్ బొమ్మలను అస్సలు కొనివ్వకూడదు. ఈ ప్లాస్టిక్ బొమ్మల తయారీ కోసం నాసిరకంగా ఉన్న ప్లాస్టిక్ వినియోగిస్తారు. ఈ బొమ్మల ప్లాస్టిక్ లో ప్రమాదకరమైన థాలేట్స్, సీసం, బిపిఏ వంటివి ఉంటాయి. ఇవి పిల్లల చర్మానికి చాలా హాని చేస్తాయి. అదే విధంగా పదునైన అంచులు ఉన్న బొమ్మలు, చిన్న చిన్న భాగాలుగా విభజించే బొమ్మలను అస్సలు కొనివ్వకూడదు. ఇవి పిల్లలకు చాలా ప్రమాదం కలిగిస్తాయి. హ్యాండిల్ చేయడానికి సేఫ్ గా అనిపిస్తాయి కానీ ఇవి పిల్లలకు గాయాలు కలిగిస్తాయి.
టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్, త్రిడి హెడ్ సెట్ వంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అస్సలు కొనకూడదు. పక్కవాళ్లను చూసి తమకు కావాలని అడిగే పిల్లలు ఉంటారు. కానీ స్క్రీన్ ను అతిదగ్గరా ఉపయోగించడం వల్ల పిల్లల మెదడుకు, కంటికి ప్రమాదం. అలాగే పిల్లలకు శారరక శ్రమ లేకుండా చేస్తాయివి.
బీడ్స్, లాకెట్స్, ప్లాస్టిక్ పువ్వులు వంటివి పొందుపరిచి రూపొందించిన దుస్తులు కొనకూడదు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా, గట్టిగా లాగినా ప్రమాదం.
Health Tips: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా.. అసలు నిజాలు ఇవీ..
పిల్లలకు తీపి పదార్థాలంటే చాలా ఇ,్టం. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు.. ఇలా చాలా పిల్లల ఫేవరెట్ లిస్ట్ లో ఉంటాయి. అయితే చక్కర పానీయాలు, చక్కెర జోడించిన పదార్థాలు కేకులు కొనివ్వకూడదు. ఇవి చిన్న తనంలోనే టైప్-2 డయాబెటిస్, ఊబకాయంకు కారణం అవుతాయి.
పక్క వాళ్లను వెక్కిరించి, బాధ పెట్టడం ఇప్పటి కాలంలో కామెడీ అయిపోయింది. అ హింస ఎక్కువగా ఉన్న వీడియో గేమ్ లు, కథలు, డాక్యుమెంటరీలు చూపించడం వల్ల పిల్లలలో దూకుడు, నిర్లక్ష్యపు ప్రవర్తన ఎక్కువ అవుతుంది.
స్టైల్ కోసం పిల్లలకు అసౌకర్యంగా ఉన్న దుస్తులు వేయకూడదు, కొనివ్వకూడదు. ముఖ్యంగా స్టైల్ గా ఉన్న దుస్తుల ప్యాబ్రిక్ పిల్లల సున్నితమైన చర్మానికి హాని చేస్తాయి. పిల్లల చర్మానికి ఎల్లప్పుడూ మెత్తగా ఉన్న దుస్తులు ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి..
బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.