Viral News: రాజస్థాన్‌లో వింత.. ఆ పక్షి గుడ్లు పెడితే వర్షాలు మొదలైనట్లే!
ABN , Publish Date - May 30 , 2024 | 07:05 PM
ఆధునికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ.. భారతదేశంలో పలు చోట్ల ఇంకా కొన్ని ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు వాటిని ఎంతో బలంగా విశ్వసిస్తుంటారు. కొన్ని దశాబ్దాల నుంచి...
ఆధునికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ.. భారతదేశంలో పలు చోట్ల ఇంకా కొన్ని ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు వాటిని ఎంతో బలంగా విశ్వసిస్తుంటారు. కొన్ని దశాబ్దాల నుంచి వాటిని అనుసరిస్తూ వస్తుంటారు. అలాగే.. రాజస్థాన్‌లోని (Rajasthan) భరత్‌పూర్‌లో ఒక నమ్మకం ఎప్పటినుంచో ప్రబలంగా ఉంది. తితహరి (Titahari) లేదా తితుడిగా (Titudi) పేరుగాంచిన రెడ్-వాటిల్డ్ లాప్‌వింగ్ (Red-Wattled Rapwing) పక్షి.. ఎత్తైన ప్రదేశాల్లో గుడ్లు పెడితే, కొన్ని రోజుల్లోనే వర్షాలు వస్తాయని ఆ గ్రామ ప్రజలు, పెద్దలు నమ్ముతారు.
Read Also: నెక్ట్స్ టార్గెట్ అదే.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ బాంబ్
ఒకవేళ ఎండిపోయిన ప్రవాహాల్లో ఈ పక్షులు గుడ్లు పెడితే.. వర్షాలు ఆలస్యంగా వస్తాయనో లేదా కరువుకి సూచనగానో మాల్వాలో నివసించే ఆదివాసీ తెగలు భావిస్తారు. అలాగే.. నది ఒడ్డున గుడ్లు పెడితే సాధారణ వర్షాలకు సూచనగా నమ్ముతుంటారు. అంతేకాదండోయ్.. ఈ పక్షులు ఆరు(6)కి పైగా గుడ్లు పెడితే.. పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలకు శుభసూచిక అని విశ్వసిస్తారు. ఈ తతిహరి పక్షికి రాబోయే వాతావరణ సంకేతాలు ముందుగానే తెలుస్తాయని.. వివిధ రకాల హానికర పక్షులు, జంతువుల రాక గురించి కూడా ఇవి తమ స్వరాల ద్వారా హెచ్చరిస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. ఈ పక్షుల్లోని మరో విశేషం ఏమిటంటే.. ఏదైనా ప్రమాదం నుంచి తోటి పక్షులను హెచ్చరించేందుకు గాను ఇవి బిగ్గరగా అరుస్తాయి.
Read Also: లోన్ వోల్ఫ్ ఎటాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు
కాగా.. ఈ తితహరి పక్షులు గడ్డి భూములు, చిన్న రాళ్లు, పాడుబడ్డ భవంతులు, పైకప్పులపై గూడు కట్టుకుంటాయి. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం వరకు దాదాపు 4 నుంచి 6 గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన 18-20 రోజుల్లో పిల్లలు పొదుగుతాయి. ఈ పక్షులు పుట్టినప్పుడు ఎరుపు రంగులో ఉంటాయి. క్రమంగా అవి పెరిగేకొద్దీ పసుపురంగులోకి మారుతాయి. ఇవి కీటకాలను తింటూ జీవనం కొనసాగిస్తాయి. ఒకవేళ తమకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని ఈ పక్షులు గ్రహిస్తే.. తమని తాము కాపాడుకోవడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోతాయి.
Read Latest Viral News and Telugu News