Share News

Seema Haider: కొత్త బాంబ్ పేల్చిన సీమా హైదర్.. పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ABN , Publish Date - Jan 02 , 2024 | 03:29 PM

సీమా హైదర్.. ఈ పేరు తెలియని భారతీయుడంటూ ఎవ్వరూ ఉండరు. పబ్‌జీ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ మీనా కోసం.. గతేడాదిలో పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి, ఆ మహిళ దేశవ్యాప్తంగా..

Seema Haider: కొత్త బాంబ్ పేల్చిన సీమా హైదర్.. పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Seema Haider - Sachin Meena: సీమా హైదర్.. ఈ పేరు తెలియని భారతీయుడంటూ ఎవ్వరూ ఉండరు. పబ్‌జీ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ మీనా కోసం.. గతేడాదిలో పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి, ఆ మహిళ దేశవ్యాప్తంగా పెను సంచలనానికే తెరలేపింది. కొంతకాలం పాటు యావత్ దేశం ఈ మహిళ గురించి చర్చించుకుంది. మొదట్లో ఆమె ఒక సీక్రెట్ ఏజెంట్ అయ్యుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ, ఆ తర్వాత కాదని తేలింది. ప్రియుడి కోసమే ఆమె భారత్‌కు వచ్చినట్టు తేలింది.


తన ప్రియుడు సచిన్‌ని వివాహమాడి దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్న సీమా హైదర్.. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఒక అనూహ్యమైన వార్తను పంచుకుంది. తాను గర్భవతినని, తన భర్త సచిన్ బిడ్డకు తల్లిని కాబోతున్నానని తెలిపింది. ఒక ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ శుభవార్త చెప్పింది. సచిన్ తండ్రి కూడా ఈ వార్త నిజమేనని, సీమా హైదర్ గర్భవతి అనే స్పష్టం చేశారు. సీమా గర్భం దాల్చిందన్న విషయం తెలిసి తాను ఆమె చేతుల్ని చూశానని, ఆమెకు అబ్బాయి పుడతాడని అనిపిస్తోందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇదీ ఇండియన్ పవర్ అని, ఈ వార్త విన్నాక పాకిస్తాన్ దద్దరిల్లిపోయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో.. అంజు-నస్రుల్లా జంటని తెరమీదకి తీసుకొస్తూ, ‘‘నీ వంతు ఎప్పుడు వస్తుంది?’’ అని నస్రుల్లాని అంజు ప్రశ్నిస్తున్నట్టుగా కామెడీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇలా.. #SeemaHaider అనే హ్యాష్‌ట్యాక్ మళ్లీ ట్రెండ్ అవుతోంది.

Updated Date - Jan 02 , 2024 | 03:29 PM