నిశ్శబ్ద నగరం
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:22 PM
అదొక క్రమశిక్షణా నగరం. అక్కడ ‘హెల్మెట్ పెట్టుకోండి, సీటు బెల్టు ధరించండి, అతి వేగంతో నడపొద్దు’ అంటూ ట్రాఫిక్ పోలీసులు వాహన దారులకు గుర్తు చేయాల్సిన పనిలేదు. రోడ్ల మీద అసలు ట్రాఫిక్ జామ్ సమస్యలే ఉండవు. ఎంతసే పైనా హారన్ మోతే వినిపించదు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ‘సైలెంట్ సిటీ’గా పిలిచే ‘ఐజాల్’ (మిజోరాం రాజధాని) అది.

ఇక్కడ ఇరుకు రోడ్లపై వాహనాలు ఒకదాని వెనుక మరొకటి ఒక క్రమపద్ధతిలో వెళ్తాయి. వాహన దారులు ఎంత ట్రాఫిక్‌లో ఉన్నా కూడా హారన్ కొట్టకుండా, ఓవర్‌టేక్ చేయకుండా వాహనాలను ఒక క్రమపద్ధతిలో నడుపుతారు.
వరుస క్రమంలో వెళ్లడమే కాకుండా, ప్రతీ ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు తప్పక ధరిస్తారు. ఐజాల్‌లో ద్విచక్ర వాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లేన్‌లు ఉంటాయి. ఎవరూ కూడా వారి లేన్ దాటి వేరే లేన్‌లోకి అస్సలు ప్రవేశించరు. రోడ్డు మీద డివైడర్లు గానీ, ట్రాఫిక్ లైట్స్ కానీ పెద్దగా ఉండవు. కేవలం రహదారిపై తెల్లటి గీతలు మాత్రమే ఉంటాయి. రద్దీగా ఉన్న సమయాల్లో సైతం ప్రజలు స్వీయ క్రమశిక్షణతో ట్రాఫిక్ రూల్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తారు. కారణం... ఒక్క దగ్గర చిన్న పొరపాటు జరిగిందంటే కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోతాయి. ఈ విషయం తెలిసే అంతా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకున్నారు. ఇంతటి క్రమశిక్షణ మనదగ్గర ఎప్పటికైనా చూస్తామంటారా?