Share News

Viral: ``టీచర్.. ఐ లవ్యూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా``.. స్టూడెంట్ షాకింగ్ ప్రపోజల్‌కు మేడమ్ రిప్లై ఏంటంటే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:06 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్ క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు. అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది.

Viral: ``టీచర్.. ఐ లవ్యూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా``.. స్టూడెంట్ షాకింగ్ ప్రపోజల్‌కు మేడమ్ రిప్లై ఏంటంటే..
Student proposed to his teacher

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్స్ (Student) క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు (Oline Class). అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే (Teacher) విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆన్‌లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో టీచర్‌కు ఓ స్టూడెంట్ లవ్ ప్రపోజల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (Student proposed to his teacher).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ టీచర్ పాఠం పూర్తయిన తర్వాత ఓ విద్యార్థి మాట్లాడాడు. చాలా అమాయకంగా మాట్లాడుతూ.. ``మీకు పెళ్లైందా`` అని టీచర్‌ను అడిగాడు. అందుకు ఆ టీచర్ ``లేదు`` అని సమాధానం చెప్పారు. వెంటనే ఆ విద్యార్థి.. ``నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను`` అని చెప్పాడు. దానికి ఆ టీచర్ స్పందిస్తూ.. ``నేను మిమ్మల్నందరినీ ప్రేమిస్తున్నా`` అని రిప్లై ఇచ్చారు. అప్పుడు స్టూడెంట్ ``మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా`` అని రెట్టించాడు. ఆ ప్రశ్నకు టీచర్ బదులివ్వకుండా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. సిగ్గుపడాలి``, ``ఇవన్నీ ఆన్‌లైన్ క్లాస్‌ల సైడ్ ఎఫెక్ట్స్``, ``ఆ టీచర్ చాలా హుందాగా ప్రవర్తించారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..


Optical Illusion: ఈ లైబ్రరీలో గంట ఎక్కడుందో వెతకండి.. 10 సెకెన్లలో వెతికితే మీ కళ్లకు తిరుగులేనట్టే..


Viral: వామ్మో.. టీచర్ మీద ఇంత పగా.. పరీక్షలో ఓ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్‌తో నివ్వెరపోవాల్సిందే..


Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న వారిలో ఓ రోబో ఉంది.. కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 12:06 PM