Share News

Puzzle: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిలో ఎవరు రోగిగా నటిస్తున్నారో చెప్పండి..!

ABN , Publish Date - Jun 14 , 2024 | 10:19 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Puzzle: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిలో ఎవరు రోగిగా నటిస్తున్నారో చెప్పండి..!
Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు లిల్లీ, మోలి, ఆడమ్. ఆ ముగ్గురూ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. లిల్లీ కడుపు నొప్పితో, మోలి కాలి గాయంతో, ఆడమ్ చేతి గాయంతో బాధపడుతున్నారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరు అరోగ్యంగానే ఉన్నారు. కావాలని అనారోగ్యంతో ఉన్నట్టు నటిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 7 సెకెన్ల వ్యవధిలో ఆ వ్యక్తిని కనిపెడితే మీకు ఐక్యూ ఎక్కువని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆడమ్ కుడి చేతికి కట్టు కట్టుకున్నాడు. కానీ, అటువైపు ఉన్న జేబులోని తన మొబైల్‌ను పెట్టుకున్నాడు. కాబట్టి, అతడి చేతికి ఎలాంటి గాయమూ కాలేదు.

ఇవి కూడా చదవండి..

Funny Video: అందుకే 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవాలి.. వేదికపై వరుడి సంతోషం.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!


Viral: భర్తంటే ఎంత ప్రేమ తల్లి.. తాను పుట్టింటికి వెళితే భర్తకు ఇబ్బందని మాస్టర్ ప్లాన్.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2024 | 10:48 AM