Share News

Lepisma flowers : పూలతోరణాలు కట్టినట్టుగా పూచే లెపిస్మా పూలు మినీ బ్రహ్మకమలాలే ..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:09 PM

స్వేచ్ఛగా పుష్పించే రిప్పాలిన్ ఆకుపచ్చరంగుతో పొడవాటి వంపులు తిరిగిన కాండంతో దృఢంగా ఉంటుంది.

Lepisma flowers : పూలతోరణాలు కట్టినట్టుగా పూచే లెపిస్మా పూలు మినీ బ్రహ్మకమలాలే ..!
Plants

పూలతోరణం అనే మాటకు ఈ మొక్క సరిగ్గా సరిపోతుంది. మొక్క ఆకుల చివరి భాగాల్లో పూలు అందంగా గుర్చినట్టుగా కనిపిస్తాయి. చక్కని తోరణం కట్టినట్టుగా ఉండే ఈపూలు, కుండీల్లో పెంచుకోవడానికి అనువైనవి. ఈ పూలు కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనిలో అన్ని రంగులలో దాదాపు 1000 జాతులు ఉన్నాయి.

బ్రహ్మ కమలం మనం ఎక్కువగా ఇష్టంగా పెంచుకునే మొక్క. చాలామంది ఇళ్ళల్లో ఈ మొక్క ఉంటుందీ మధ్య. ఇది ఉంటే దైవానుగ్రహం మనకు తప్పక ఉంటుందని భావించేవారూ లేకపోలేదు. అయితే ఈ మొక్కలన్నీ బ్రహ్మ జముడు మొక్కల ఆకారంలోనే కనిపిస్తూ ఉంటాయి. రిప్సాలిస్ లేదా లెపిస్మా కూడా ఇంచుమించు అదే రూపంలో కనిపిస్తుంది. ఆకారణే కాదు పూల ఆకృతి కూడా అచ్చం అలానే ఉంటుంది. కాకపోతే కాస్త బ్రహ్మజముడులా ముళ్ళుండవు చెట్టంతా చూడడానికి బ్రహ్మకమలం చెట్టులానే ఉంటుంది కానీ పూలు రంపంగా ఉండే ఆ ఆకు చివరన పూస్తాయి. అదే ఈ చెట్టు ముఖ్య లక్షణం. ఇక వీటి పండ్లు కూడా బ్రహ్మజముడు చెట్టుకు పూసినట్టే ఎర్రగా పూస్తాయి.

Health Benefits : ఉదయం ఖాళీ కడుపుతోనే వెల్లుల్లి తింటే జీర్ణ సమస్యలు మాయం..!

బ్రహ్మజముడు పొదల్లోని పూలు, పండ్లు చాలా అందంగా కనిస్తాయి. అలాగే ఈ బ్రహ్మజముడు కాయలను తింటారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అంతా తప్పకుండా తినేందుకు చూసే బ్రహ్మ జముడు కాయలు ఎర్రగా మిగల ముగ్గిపోయి ఉంది. ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇక స్వేచ్ఛగా పుష్పించే రిప్పాలిన్ ఆకుపచ్చరంగుతో పొడవాటి వంపులు తిరిగిన కాండంతో దృఢంగా ఉంటుంది.


Drinking Vamu Water : వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...

లెపిస్మియమ్ హౌలెటియనమ్.. ఈ చెట్టుకు తెల్లని పూలు పూస్తాయి. ఇవి అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియాలతో పాటు ఇండియాలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉష్ణమండల తేమ అడవులలో ఎపిఫైట్ పెరుగుతుంది. దీని పండ్లు గుండ్రంగా ముదురు నలుపు రంగులో 0.4 అంగుళాల వరకూ ఉంటాయి.

ఈ మొక్కలు మధ్యాహ్నం సూర్యరశ్మికి గురికావడం వల్ల ఆకులు వాలిపోతాయి. కాబట్టి పెద్దగా ఎండ తగలని చోట ఉంచాలి. హేంగింగ్ పాట్ కింద వీటిని హేంగ్ చేయడం వల్ల ఇంటికి మంచి కళ వస్తుంది. లెపిస్మియన్ అడవిలోనే కాదు.. ఇళ్ళలో కూడా ఇప్పుడు అందంగానే ఉంటుంది. కాకాపోతే కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 22 , 2024 | 04:14 PM