Viral Video: రోటీస్‌ను త్వరగా తయారు చేయడానికి టైం సేవ్ చేసే చిట్కా తెలుసా..!
ABN , Publish Date - Mar 19 , 2024 | 01:53 PM
కలిపి ఉంచిన పిండిని ఒకేసారి పెద్దగా వరుసగా ఒత్తుకుంటూ వచ్చి, చిన్న గిన్నెతో నాలుగు చపాతీలుగా గుండ్రని ఆకారంలో కట్ చేసింది.
వంట రుచికరంగా చేయాలంటే దానికి తగిన శ్రమ కూడా అవసరమే. టైం కేటాయించి మరీ శ్రమపడి వంట చేసే గృహిణులు ఎందరో.. ఇందులో ఉద్యోగాలకు వెళ్లే వారు ఇంకొందరు, కొందరు ఉద్యోగాలకు వెళ్లే వారికి, స్కూళ్ళకు వెళ్లే వారికీ గంటల తరబడి వండి వడ్డిస్తూ ఉంటారు. ఇలాంటి శ్రమపడే ఇల్లాళ్ళకు అందరికీ చక్కని రూట్ చూపించింది. దీనితో పెద్ద శ్రమలేకుండానే ఒకే దెబ్బకు నాలుగు చపాతీలు చేసి పారేయచ్చు.
చపాతీలు, రోటీలు చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని,.. ముఖ్యంగా ముద్ద కలుపుకుని దానిని చపాతీలుగా అద్ది తయారు చేయడమే బోలెడు సమయాన్ని తినేస్తుంది. ఇక చేసిన చపాతీలను వేయించడానికి మరికాస్త సమయం పడుతుంది. ఇన్ స్టాగ్రామ్ ని ఊపు ఊపేస్తున్న ఈ ఇల్లాలి చిట్కా విషయానికి వస్తే..
కలిపి ఉంచిన పిండిని ఒకేసారి పెద్దగా వరుసగా ఒత్తుకుంటూ వచ్చి, చిన్న గిన్నెతో నాలుగు చపాతీలుగా గుండ్రని ఆకారంలో కట్ చేసింది. తరువాత పెనం పెట్టి వేడి చేసి వాటిని పక్కనే ఉన్న మరో స్టావ్ మీద కాల్చి చపాతీలను ఫ్లేట్‌లో వేసుకుంది. ఇంత సులువుగా చపాతీలను తయారుచేయచ్చని చూపించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: రాత్రి ప్రశాంత నిద్ర కావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే..!
ఈ వీడియో 28 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ప్రశంసలను పొందింది. వినియోగదారులు "సమయం ఆదా చేసే విధానాన్ని" టెక్నిక్‌ని ప్రశంసిస్తూ, వ్యాఖ్యల విభాగాన్ని ప్రశంసలతో నింపారు. చాలా మంది ఈ మహిళ చాతుర్యాన్ని మెచ్చుకున్నారు, కష్టపడి కాకుండా తెలివిగా పనిచేయడం ప్రతి ఒక్కరూ పాటించాలని.. సమయాన్ని ఆదా చేసుకోవాలని చెప్పుకొచ్చారు.