Share News

ఇవి కూడా పుట్టగొడుగులే!

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:27 AM

పుట్టగొడుగులు ఎప్పుడో ఒకసారి కాకుండా క్రమక్రమంగా వంటగదిలోకి వచ్చేస్తున్నాయి. ఆరోగ్యస్పృహ ఉన్నవారు తరచూ వాటిని తింటున్నారు. మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పుట్టగొడుగులను కూర వండుకోవటం నుంచి పులావ్‌, టిక్కాలు, సూప్‌లుగా కూడా లాగిస్తున్నారు. అయితే మష్రూమ్స్‌లో కూడా రకరకాలున్నాయి.

ఇవి  కూడా పుట్టగొడుగులే!

పుట్టగొడుగులు ఎప్పుడో ఒకసారి కాకుండా క్రమక్రమంగా వంటగదిలోకి వచ్చేస్తున్నాయి. ఆరోగ్యస్పృహ ఉన్నవారు తరచూ వాటిని తింటున్నారు. మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పుట్టగొడుగులను కూర వండుకోవటం నుంచి పులావ్‌, టిక్కాలు, సూప్‌లుగా కూడా లాగిస్తున్నారు. అయితే మష్రూమ్స్‌లో కూడా రకరకాలున్నాయి.

- కొత్తతరం పుట్టగొడుగులను పోషకాహారంగా భావించి వాటితో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. కేవలం కూరలాగా కాకుండా ఫ్రై, టిక్కా, సూప్‌, పులావ్‌ లాంటి మోడ్రన్‌ డిషెష్‌ను తయారుచేస్తున్నారు.


- బటన్‌ మష్రూమ్స్‌ మాత్రమే చాలామందికి తెలుసు. సాధారణంగా సలాడ్స్‌ రూపంలో వీటిని తీసుకుంటున్నారు. మరికొందరు సూప్స్‌, ఫ్రైలు చేస్తున్నారు. వీటితో చేసిన మష్రూమ్‌ బిర్యానీ, మటర్‌ మష్రూమ్‌, మష్రూమ్‌ రిసొట్టోలు రెస్టారెంట్‌ మెనూకార్డులో కనిపిస్తున్నాయి.

book13.2.jpg

- తెల్లటి సన్నటి తీగకు పైన బొడిపెలాగా ఉండే ఎనోకీ మష్రూమ్స్‌ ప్రత్యేకమైనవి. ఇవి చాలా సున్నితంగా రుచిపరంగా నోరూరిస్తూ కరకరలాడు తుంటాయి. వీటిని సాధారణంగా సలాడ్స్‌గా లేదంటే సూప్స్‌లో వాడుతారు. ‘సుషీ’ అనే వంటకంలో పైన టాపింగ్‌ కూడా చేస్తారు.


- సాధారణంగా పుట్టగొడుగులు తెల్లగా ఉంటాయి కానీ మోరెల్‌ మష్రూమ్స్‌ గోధుమ వర్ణంలో ఆకట్టుకుంటాయి. క్రీమ్‌తో చేసే సాస్‌లలో, పులావ్‌లలో, రిసొట్టో అనే వంటకంలో వీటిని ఎక్కువగా వాడతారు.

book13.3.jpg

- పుట్టగొడుగుల్లో అత్యంత రుచికరమైనవి షీటేక్‌ మష్రూమ్స్‌. వాటి నాణ్యమైన, స్మోకీ ఫ్లేవర్‌ రుచి నోరూరిస్తుంది. ఫ్రై చేయడంతో పాటు సుషీ, సూప్స్‌లలో కూడా వినియోగిస్తారు.


- పుట్టగొడుగులను స్టోర్‌ చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. అలా చేస్తేనే తాజాగా, ఎక్కువరోజులు నిలువ ఉంటాయి. పుట్టగొడుగులు బయటి వాతావరణంలో ఎక్కువకాలం మనలేవు. వాటిని తప్పకుండా ఫ్రిజ్‌లోనే ఉంచాలి. ప్లాస్టిక్‌ బ్యాగులో కన్నా పేపర్‌ బ్యాగులో ఉంచితేనే మంచిది. గాలిప్రసరణ సరిగా జరిగితేనే పాడవకుండా ఉంటాయి. తేమ ఎక్కువ పడితే మురిగిపోతాయి.

- స్టోర్‌ చేసే ముందు చాలామంది పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడుగుతారు. అయితే దాని వల్ల తేమ పెరిగి త్వరగా కుళ్లిపోతాయి. అందుకే వినియోగించే ముందే వాటిని కడిగితే సరిపోతుంది.

- పుట్టగొడుగులను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేం. అందుకే కొన్న వారం లోపే వాడేయాలి.

Updated Date - Oct 27 , 2024 | 11:27 AM