Diwali 2024: దీపావళికి టపాసులు కాల్చుతారా.. ఈ టిప్స్ మీ కోసమే
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:00 PM
దీపావళి సందర్భంగా చిన్నపిల్లలు ఎంతో సందడిగా టపాసులు కాల్చడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాబట్టి పండగ వేళ, సంతోషకరమైన సమాయంలో కుటుంబాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. సురక్షితంగా దీపావళి జరుపుకునేందుకు నిపుణులు చూపిస్తున్న కొన్ని టిప్స్ ఇవే..
వెలుగులు పంచే పండగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధించిన ఈ పర్వదినాన్ని కుటుంబంలోని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్‌కు సిద్దమయ్యారు. దక్షిణభారత దేశంలో గురువారం (అక్టోబర్ 31) ఈ పండగ జరగనుంది. వేడుకల్లో ప్రధానంగా బాణాసంచా కాల్చడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో సందడిగా టపాసులు కాల్చడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాబట్టి పండగ వేళ, సంతోషకరమైన సమయంలో కుటుంబాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. సురక్షితంగా దీపావళి జరుపుకునేందుకు నిపుణులు చూపిస్తున్న కొన్ని టిప్స్ ఇవే..
జాగ్రత్తలు ఇవే..
బాణసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యత, భద్రత కోసమైనా లైసెన్స్ పొందిన దుకాణదారుల నుంచి మాత్రమే టపాసులు కొనుగోలు చేయడం అత్యుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా బాణసంచా ఉపయోగించే ముందు దానికి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
ఎప్పుడూ కాల్చని, అవగాహన లేని బాణసంచా కాల్చే ప్రయత్నాలు చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బాణసంచా కాల్చే సమయంలో మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం. ముఖ్యంగా గడ్డివాములు, తాటాకు ఇళ్లకు దూరంగా టాపాసులు కాల్చాలి. అంతేకాదు డాబాలే అయినప్పటికీ వాటికి కూడా దూరంగా క్రాకర్ కాల్చడం శ్రేయస్కరం. ఒక బకెట్ నీరు లేదా మంటలను ఆర్పే పరికరాన్ని సమీపంలో ఉంచుకోవడం చాలా ఉపయోగకరమని, తెలివైన పని అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఎదురైతే అది పెనుప్రమాదంగా మారకముందే ప్రతిస్పందించవచ్చని చెబుతున్నారు.
ఇక దీపాలు, కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు వాటిని మండని ఉపరితలాలపై ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీపాలు ప్రమాదవశాత్తూ కిందపడినా ఎలాంటి ప్రమాద జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దీపాల్లో తక్కువగా మండే ఆయిల్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. దీపాలను పిల్లలు లేదా పెంపుడు జంతువులు ముట్టుకోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు టపాసులు పేల్చిన తర్వాత వెలువడే పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మాస్కులు ధరించడం చాలా మంచిది. అంతేకాదు టపాసుల శబ్దాలు భరించలేనివారు చెవుల్లో దూది లేదా చిన్న వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక దీపావళి అంటే కేవలం దీపాసుల జాగ్రత్తలే కాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్లు లేదా ఇతర ఆహార పదార్థాలను స్వచ్ఛే పదార్థాలతో తయారు చేసినవాటిని వాడాలని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
For more Business News and Telugu News