Viral: వేసవికి తెలివితో చెక్.. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:43 PM
గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. . మే నెల ప్రారంభం కాకముందే వేడి, ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఎండలు (Summer) మండిపోతున్నాయి. మే నెల ప్రారంభం కాకముందే వేడి, ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఆయా జుగాడ్ వీడియోలు (Jugaad video), ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. తెలివి తేటల విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారని కామెంట్లు చేస్తున్నారు (Viral news).
ఓ వ్యక్తి వాడేసిన నూనె డబ్బాను కూలర్‌లా మార్చేశాడు. ఒకవైపు గడ్డి పెట్టి ఆ డబ్బా లోపల ఫ్యాన్ పెట్టాడు. మరో వ్యక్తి కారు లోపల చల్లదనం కోసం కారుకు ఆవు పేడ రాశాడు. ఆవు పేడు సూర్య రశ్మిని ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేస్తుంది.
అలాగే ఓ వ్యక్తి తన తలకు టర్బైన్ లాంటిది పెట్టుకుని దానికి చిన్న టేబుల్ ఫ్యాన్ సెట్ చేసుకున్నాడు. అలాగే ఓ బస్సు కిటికీ బయటకు కూలర్ అమర్చి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరికొందరు గోనెను టేబుల్ ఫ్యాన్ చుట్టూ పెట్టి ఉపశమనం పొందుతున్నారు.
ఆయా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్టాలను తాకుతున్నాయి. చాలా ప్రాంతాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. వర్షాలు కూడా పడకపోవడంతో చాలా మంది వేడి కారణంగా ఆపసోపాలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ ఫొటోలోని ఏనుగును 5 సెకెన్లలో గుర్తించగలరా?.. కేవలం 5.7 శాతం మందికే సాధ్యమైందట!
Viral Video: ఏం టెక్నిక్ తల్లీ.. టైమ్ వేస్ట్ కాకుండా చపాతీలను ఎలా వత్తేసిందో చూడండి.. వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..