Horoscope : రాశిఫలాలు
ABN , Publish Date - Jan 18 , 2024 | 07:11 AM
నేడు (18-1-2024 - గురువారం) మిథునం రాశి వారు షేర్‌మార్కెట్ లావాదేవీలు, విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సింహం రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
నేడు (18-1-2024 - గురువారం) మిథునం రాశి వారు షేర్‌మార్కెట్ లావాదేవీలు, విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సింహం రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కన్య రాశివారు వాయిదాల పద్ధతిపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రముఖులతో సమావేశాల్లో నిదానంగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. సంకల్ప సాధనలో పెద్దల నుంచి సహకారం లోపించే అవకాశం ఉంది. గాయత్రీమాత ఆరాధన శుభప్రదం.
వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
వీసా, పాస్‌పోర్ట్ వ్యవహారాల్లో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఫొటోగ్రఫీ, గ్రానైట్, ఎగుమతులు, వస్త్ర వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలకు సంబంధించిన చర్చలు, డాక్యుమెంటేషన్‌ల విషయంలో జాగ్రగ్తలు తీసుకోవాలి. కాంట్రాక్టుల విషయంలో నిదానం అవసరం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్ లావాదేవీలు, విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విరాళాలు, సేవా కార్యక్రమాలు కోసం వెచ్చిస్తారు. దత్తాత్రేయ కవచ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలు, వివాహ ఏర్పాట్లపై ఒక నిర్ణయానికి వస్తారు. పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లోపిస్తుంది. సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించండి.
సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, విందుల్లో నిదానం పాటించండి. కళా సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పన్నుల వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాయిదాల పద్ధతిపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అడ్వర్టయిజ్‌మెంట్, క్రీడలు, హార్డ్‌వేర్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి.
తుల (సెప్టెంబరు 24-అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. న్యాయ వివాదాలు చికాకు కలిగిస్తాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. భాగస్వామితో కుటుంబ విషయాలు చర్చిస్తారు. సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ములతో ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. ఫార్మా, ఆహార పరిశ్రమల ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, అడ్వర్టయిజ్ మెంట్‌లు, పాఠశాలలు, స్టేషనరీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దత్తాత్రేయ స్వామి కవచ పారాయణ మంచిది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. కుటుంబ సభ్యుల వైఖరి గురించి ఆలోచిస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మనసు మార్పును కోరుకుంటుంది. సాయిబాబా ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సంభాషణలు, సందేశాల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యాసంస్థల ఉద్యోగులు, కమ్యూనికేషన్ రంగ వ్యాపారులకు కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. సాయి ఆలయాన్ని దర్శించండి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
షేర్‌మార్కెట్ లావాదేవీలు, మ్యూచ్యువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ