Share News

Horoscope : రాశిఫలాలు

ABN , Publish Date - Jan 22 , 2024 | 07:22 AM

నేడు (22-1-2024, సోమవారం) వృషభం రాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. మిథునం రాశివారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం రాశివారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

నేడు (22-1-2024, సోమవారం) వృషభం రాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. మిథునం రాశివారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం రాశివారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. వారసత్వ విషయాలు పరిష్కారం అవుతాయి. ఇక మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మార్కెటింగ్‌, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దలు, పైఅధికారుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. శివాలయాన్ని దర్శించండి.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. వారసత్వ విషయాలు పరిష్కారం అవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శివ పంచాక్షరిని జపించండి.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండండి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ సంస్థల వారికి అనుకూల సమయం. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయాలో కొంత నిరాశ తప్పకపోవచ్చు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రవాణా, రక్షణ, బోధన, న్యాయ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బీమా, పెన్షన్‌ పనులు పూర్తవుతాయి. పన్నుల విషయాలపై దృష్టి పెడతారు. గృహరుణాలు మంజూరు కావడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. శివాలయాన్ని దర్శించండి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

భాగస్వామితో చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం పాటించడం అవసరం. శివారాధన శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. హోటల్‌, రిటైల్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. క్రీడలు, విద్య, చిట్‌ఫండ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. బదిలీలు, మార్పులు, చేర్పులు కొంత అ సౌకర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులుకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Jan 22 , 2024 | 07:32 AM