Horoscope: ఈ రాశివారికి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది..
ABN , Publish Date - Feb 06 , 2024 | 06:52 AM
నేడు (6-2-2024 - మంగళవారం) వృషభ రాశి వారికి రుణాలు, ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అడ్వాన్సులు, బిల్లులు అందుకుంటారు. కర్కాటకం రాశి వారు.. ఔషధాలు, ఆస్పత్రుల రంగాల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సింహం రాశివారికి ప్రేమానుబంధాలు బలపడతాయి.
నేడు (6-2-2024 - మంగళవారం) వృషభ రాశి వారికి రుణాలు, ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అడ్వాన్సులు, బిల్లులు అందుకుంటారు. కర్కాటకం రాశి వారు.. ఔషధాలు, ఆస్పత్రుల రంగాల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సింహం రాశివారికి ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. ఇక మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులో ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి. వేడుకలు, సమావేశాలకు సన్నాహాలు చేస్తారు. దూరప్రయాణాలకు అవసరమైన వసతులు సమకూర్చుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
రుణాలు, ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అడ్వాన్సులు, బిల్లులు అందుకుంటారు. మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. ఆర్థికపరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఔషధాలు, ఆస్పత్రుల రంగాల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తారు. ఆరోగ్య బీమా గురించి ఆరా తీస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. శుభకార్యాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
నిర్మాణం, హార్డ్‌వేర్, ఇంటీరియర్స్ రంగాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగరంగంలో చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహి తుల నుంచి శుభవార్త అందుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సాయిబాబాను ఆరాధించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. గృహరుణాలు మంజూరవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సోదరీసోదరుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. సన్నిహితులతో చర్చలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఏజెన్సీ వ్యాపారులు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యా రుణాలు మంజూరవుతాయి. నిధుల విషయంలో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయికతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. పదిమందిని కలుపుకొని మంచి పనికి శ్రీకారం చుడతారు. యూనియన్ కార్యలాపాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన లక్ష్యాల సాధనలో సన్నిహితులు సహకరిస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల అభివృద్ధి కోసం దూరప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూల సమయం. ఉద్యోగంలో మీ పురోగతిని సమీక్షించుకుంటారు. లక్ష్య సాధనకు పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు గత అనుభవంతో మంచి పురోగతి సాధిస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ