Share News

Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:08 AM

ఇంటికి వంటగది హృదయం లాంటిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో జనించే శక్తే కుటుంబానికి ఆలంబనగా నిలుస్తుంది. కిచెన్‌లో వస్తువులను వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుంది.

Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!

ఇంటర్నెట్ డెస్క్: ఇంటికి వంటగది హృదయం లాంటిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో జనించే శక్తే కుటుంబానికి ఆలంబనగా నిలుస్తుంది. కిచెన్‌లో వస్తువులను వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ ఏర్పాటులో తప్పనిసరి జాగ్రత్తలు ఏంటంటే (Vaastu Tips)..

వాస్తుశాస్త్రం ప్రకారం, ఆగ్నేయ దిక్కుకు పాలకుడు అగ్ని. కాబట్టి, ఇంటికి ఈ దిశలో వంటగదిని ఏర్పాటు చేయాలి. వంటగదిని ఉత్తర, ఈశాన్య దిశల్లో ఏర్పాటు చేయొద్దు. లేకపోతే కుటుంబాన్ని ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి.

వంటగదిలోని స్టవ్ కూడా ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. వంటగది ద్వారానికి ఎదురుగా స్టవ్ పెట్టుకోకూడదని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.

Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!


వాస్తు శాస్త్రం ప్రకారం, నీరు, నిప్పుకు పరస్పర విరుద్ధమైన గుణాలున్నాయి. కాబట్టి, స్టవ్‌, సింకు ఎదురెదురుగా ఉండకూడదు. వీలైతే సింకు లేదా నల్లాను ఈశాన్యాన ఏర్పాటు చేయడం ఉత్తమం. దీంతో, అగ్ని, నీటి మధ్య సమతౌల్యం పాటించినట్టు అవుతుంది.

వంటగదిలో ఎనర్జీ ఫ్లో సాఫీగా సాగిపోవాలంటే తగినంత వెలుతురు లోపలికి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో తూర్పు వైపున కిటికీలు ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. తూర్పు, లేదా వాయువ్య దిశలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా చిమ్నీ ఏర్పాటు చేస్తే ఇంట్లోని నెగెటివ్ శక్తులను వదిలించుకోవచ్చు

పప్పులు, ధన్యాలు వంటి ఆహార పదార్థాలన్నీ వంటగదిలోని నైరుతి దిశలో పెట్టుకోవాలి. స్థిరత్వానికి, శక్తికి స్థానమైన నైరుతిలో ఆహారపదార్థాలు పెడితే కుటుంబంలో సుఖశాంతులకు లోటు ఉండదు. అయితే, ఈ దిశలో భారీ కేబినెట్స్, ఇతర స్టోరేజీ వస్తువులు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ రాకకు అడ్డంకులు ఏర్పాడతాయని కూడా వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!


వంటగదికి పసుపుపచ్చ, ఆకుపచ్చ, నారింజ, తెలుపు రంగులు అనువైనవి. ఈ రంగులు శ్రేయస్సు, తాజాదనం, శుభ్రతకు చిహ్నాలు. ఇక వంటగదికి నలుపు, బూడిదె రంగు లేదా ఇతర ముదురు షేడ్స్ వాడకపోవడమే మంచిది. ఇవి నిరాశ, ప్రతికూల వాతావరణాన్ని తలపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వంటగదిలో వస్తువులు చిందరవందరగా ఉంటే శక్తి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయట. కాబట్టి, వంటగదిలో వస్తువులను జాగ్రత్తగా ఓ పద్ధతి ప్రకారం సర్దుకోవాలి. పాత, విరిగిపోయిన గిన్నెలు, ఎక్కువగా వాడని గృహోపకరణాలు వంటింట్లో ఉంచొద్దు. శుభ్రంగా ఉండే వంటిల్లు సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. వంటిల్లు స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రపరుస్తూ ఉంటే కిచెన్ మెరిసిపోతు పాజిటివ్ శక్తితో తొణికిసలాడుతుంది.

Read Latest and Viral News

Updated Date - Dec 07 , 2024 | 10:16 AM