Eel in Colon: కడుపు నొప్పితో వచ్చిన పేషెంట్‌కు పరీక్షలు.. అతడి పేగులో ఏముందో చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..
ABN , Publish Date - Mar 23 , 2024 | 03:41 PM
ఓ వ్యక్తి కడుపులో ఈల్ చేపను చూసి వైద్యులు షాక్. వియత్నాంలో వెలుగు చూసిన ఘటన
ఇంటర్నెట్ డెస్క్: మానవ శరీరం గురించి పూర్తి అవగాహన ఉండే డాక్టర్లే ఆశ్చర్యపోయే అసాధారణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పెద్దపేగులో సజీవంగా ఉన్న ఈల్ చేపను గుర్తించిన డాక్టర్లు ఒక్కసారిగా షాకైపోయారు. అది అక్కడికి ఎలా చేరుకుందో అర్థమయ్యాక వారి నోటమాట రాలేదు. వియత్నాంలో (Vietnam) ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, క్వాంగ్ నీంహ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (24) ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేసిన డాక్టర్లు పేషెంట్ పేగుల్లో ఉన్నదేంటో చూసి ఆశ్చర్యపోయారు. పెద్ద పేగు చివరి భాగం కోలాన్‌లో సజీవంగా ఉన్న ఈల్ చేప వారిని నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ చేప కారణంగా అతడి కోలాన్‌లో చాలా చోట్ల రంధ్రాలు పడ్డాయి (Eel in colon alive).
Fuel: విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేస్తారో తెలిస్తే..
దీంతో, మరో మార్గం లేక ఆసుపత్రి వర్గాలు అతడికి ఆపరేషన్ చేసి ఈల్‌ను తొలగించారు. ఈ కారణంగా పేగులో గాయపడ్డ భాగాన్ని పూర్తిగా తొలగించారు. పేషెంట్ మలద్వారం మీదుగా అది పేగుల్లోకి చొరబడి ఉంటుందని అక్కడి వైద్యులు భావిస్తున్నారు.
ఇది చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ అని వైద్యులు తెలిపారు. కోలాన్ పక్కనే ఉన్న పురీషనాళంలో వ్యాధి కారక సూక్ష్మక్రిములు అనేకం ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఆపరేషన్ సందర్భంగా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందన్నారు. అయితే, ఈసారి ఆపరేషన్ విజయవంతమైందని, రోగి కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే, మలద్వారం, పురీషనాళం మీదుగా పెద్దపేగు వరకూ ఆ జీవి ఎలా వెళ్లిందో ఎవరికీ అంతుచిక్కట్లేదు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి