Viral: ఇది కదా నాన్నంటే.. ఓ రచయిత్రి షేర్ చేసిన పోస్ట్ చూస్తే గుండె బరువెక్కడం ఖాయం!
ABN , Publish Date - Jan 05 , 2024 | 09:16 AM
పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ.
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైంది. తల్లిదండ్రులు సాక్షాత్తూ కనిపించే దేవుళ్లు అని అంటారు. చిన్నతనం నుండి పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు. పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ. ప్రతి ఇంట్లో ఇది సహజమే అయినా కొందరు తమ తండ్రుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. ఓ రచయిత్రి తన తండ్రి గురించి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్ల మనసు బరువెక్కుతోంది. తండ్రి మీద తమకున్న ప్రేమను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ గురించి పూర్తీగా తెలుసుకుంటే..
రచయిత్రి, పాత్రికేయురాలు అయిన రితుపర్ణ(Author and Journalist Rituparna) తాజాగా ట్విట్టర్ ఎక్స్( లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆమెకు తన తల్లిదండ్రులు కొన్ని ఫోటోలు పంపారు. ఆ ఫోటోలో ఆమె తండ్రి ఓ జాకెట్ ధరించారు. రితుపర్ణ 20ఏళ్ల క్రితం 150రూపాయలు పెట్టి జాకెట్ కొనుగోలు చేశారు. ఆ తరువాత ఆమెకు మెరుగైన జీతం రావడంతో ఆ జాకెన్ ను పక్కన పెట్టి కొత్త దుస్తులను కొనుగోలు చేసింది. తరువాత ఆమెకు పెళ్లై తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది. కానీ ఆమె తండ్రి మాత్రం ఇప్పటికీ ఆమె జాకెట్ ను ఉదయాన్నే ధరించి స్నేహితులతో కలసి వాకింగ్ వెళుతున్నారట. ఆ జాకెట్ కు జిప్ లు పోయినా సరే ఆయన దాన్ని పక్కన పెట్టడం లేదట. 20ఏళ్ళ క్రితం నాటి జాకెట్ ధరించిన ఆయన ఫోటో రితుపర్ణకు పంపడంతో ఆమె షాక్ కు గురైంది.
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునేముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే.. జరిగేదిదే..!
ఇప్పటికీ ఆమె తండ్రికి 5-6 చొక్కాలు, 2 కాలర్ టీ షర్టులు, 4-5 ప్యాంటు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. తన తండ్రి ఎప్పుడూ అవసరం లేకుండా ఎప్పుడూ డబ్బు ఖర్చుపెట్టకూడదని, అది డబ్బు వృధా చేయడమేనని చెప్పేవాడని గుర్తుచేసుకుంది. ఈ విషయాన్ని Rituparna తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో చాలా భావోద్వేగంతో షేర్ చేసింది. ఈమె పోస్ట్ కు నటి దియా మీర్జా(Actor Dia Mirza) కూడా స్పందించింది. నెటిజన్లు కూడా ఈ పోస్ట్ చూసి తమ తండ్రులను గుర్తుతెచ్చుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. 'నాన్నంటే ఇంతే.. ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు' అన్న రితుపర్ణ మాటలను సమర్థిస్తున్నారు.