Share News

Viral: వామ్మో ఈ ఒక్క ఫొటోలో ఇన్ని రహస్యాలున్నాయా? ఈ ఫొటోలో మీకు మొదట కనిపించే దృశ్యం మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుందట..!

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:13 PM

వామ్మో ఈ ఒక్క ఫొటోలో ఇన్ని రహస్యాలున్నాయా? ఈ ఫొటోలో మీకు మొదట కనిపించే దృశ్యం మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుందట..!

Viral: వామ్మో ఈ ఒక్క ఫొటోలో ఇన్ని రహస్యాలున్నాయా? ఈ ఫొటోలో మీకు మొదట కనిపించే దృశ్యం  మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుందట..!

మన మెదడు చాలా శక్తివంతమైనదని అనుకుంటాం. కానీ మెదడును కూడా బోల్తా కొట్టించగల సందర్బాలు, దృశ్యాలు ఉంటాయి. వీటినే ఆప్టికల్ భ్రమలు అని అంటారు. మొదట కనిపించే దృశ్యం ఒకటిగా ఉంటుంది. కానీ బాగా గమనిస్తే అందులో మరిన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. అవన్నీ మెదడు శక్తిని, దృష్టి శక్తిని పరీక్షించేవి. కానీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటోలను ఎప్పుడైనా చూశారా? అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూడగానే మొదట ఏం కనబడుతుందో దాన్ని బట్టి ఆ వ్యక్తి కి తన భాగస్వామి పట్ల ఉన్న ఫీలింగ్ ఏంటో ఈజీగా చెప్పేయచ్చట. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న విభిన్న కోణాలు ఏంటి? మొదట ఏం కనబడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పూర్తిగా తెలుసుకుంటే..

వృద్దుడి ముఖం..

ఫొటో చూడగానే మొదట వృద్దుడి ముఖం కనిపిస్తే అది మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుందట. చిన్న చిన్న గొడవలు, తగాదాల వల్ల భాగస్వామిని అంత ఈజీగా వదిలేయలేరట. భాగస్వామి మీద ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే నిజాయితీ పరులట.

ఇది కూడా చదవండి: Skin Care: చలికాలంలో బాడీ లోషన్లు అక్కర్లేదు.. ఈ 5 నూనెల్లో ఏ ఒక్కటి వాడినా చర్మం మెరిసిపోతుంది!



గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి..

ఫొటో చూడగానే మొదటగా గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి కనబడితే మీరు కలలు కంటున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారని అర్థమట. భాగస్వామి కళ్లెదుటే ఉన్నా సరే.. చుట్టూ చూస్తూ ఉంటారట. లేదంటే భాగస్వామి మీ దృష్టిలో గౌరవంగా ఉండమని చెబుతున్నారట.

నది ఒడ్డున పడుకున్న యువతి..

ఫొటోలో నది ఒడ్డున ఓ అమ్మాయి పడుకున్నట్టు కనిపిస్తుంది. దీని అర్థం మీరు ప్రేమించిన వ్యక్తిని వెతకడంలో లేదా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కోసం నిరీక్షిస్తూ ఉన్నారని అర్థమట. ఇది మాత్రమే కాదు ఇది శారీరక వాంఛను కూడా సూచిస్తుందట. గతంలో ప్రేమలోనూ, బంధంలోనూ జరిగిన చేదు సంఘటనలు మళ్లీ మిమ్మల్ని కొత్త బంధాలు నమ్మేలా చేయడంలో అడ్డుకుంటాయని కూడా సూచిస్తుందట.

రాతి అంచు..

ఫొటోలో కనిపించే నది అలలు తెల్లగా రాతి అంచులాగా కొందరికి కనిపిస్తాయి. ఇలా కనిపించిన వ్యక్తి జీవితంలో సాహసం చెయ్యడానికి ఉవ్విళ్లూరుతూ ఉంటాడట. ఈ కారణంగా జీవితంలో స్థిరత్వం లేకుండా ఉండటాన్ని ఇది సూచిస్తుందట. మీ మనస్తత్వం కారణంగా ప్రేమ, వివాహం వంటి సంబంధాలలోకి వెళ్లడానికి భయపడుతుంటారట.

ఇది కూడా చదవండి: పిల్లల ఐక్యూ వీర లెవల్ లో ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

Updated Date - Jan 17 , 2024 | 04:37 PM