Viral Video: పిల్లలతో అడవికి వెళ్లి ఇవేం పనులయ్యా బాబూ.. ఈ టూరిస్ట్ లు ఏం చేశారో మీరే చూడండి!
ABN , Publish Date - Feb 16 , 2024 | 12:24 PM
కొందరు టూరిస్టులు చిన్నపిల్లలతో అడవిలో సఫారీకి వెళ్లి చేసిన పని చాలా షాకింగ్ గా ఉంది.
టూర్లకు వెళ్లడం అందరికీ సరదా.. చిన్నపిల్లలు ఉంటే వాళ్లను ఎప్పుడూ ఏదో ఒక చోటికి తీసుకెళ్తూ ఉండాలి. అయితే కొందరు మాత్రం టూర్లకు వెళ్లినప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తన కాస్తా కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు టూరిస్టులు చిన్నపిల్లలతో అడవిలో సఫారీకి వెళ్లి చేసిన పని చాలా షాకింగ్ గా ఉంది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు టూరిస్టుల మీద మండి పడుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఇది కూాడా చదవండి: Health Tips: 83ఏళ్ల డాక్టర్ చెప్పిన ఫుడ్ సీక్రెట్ ఇదీ.. ఈ ఆహారాలు తింటే వృద్దాప్యంలోనూ యంగ్ గా ఉండొచ్చట..!
కొందరు టూరిస్టులు డెహ్రాడూన్ లో జంగిల్ సఫారీకి(Dehradun jungle safari) వెళ్లారు. అడవిలో వారి సరదా కాస్తా శృతి మించింది. సఫారీలో వారికి ఒక పెద్ద పులి కనబడగానే దాన్ని దగ్గర నుండి చూడాలని, దాంతో ఫొటో తీసుకోవాలని సరదా పుట్టింది. దీంతో వారు పులికి దగ్గర్లోనే జీపును ఆపి జీపు మీద కూర్చున్నారు. వారికి కొన్ని అడుగుల దూరంలోనే పులి కూర్చుని ఉంది. జీప్ మీద కూర్చున్న వారి ఫేస్ కనిపించకుండా ఫేస్ లకు జోకర్ ఎమోజీలు ఎడిట్ చేశారు. ఈ విషయాన్ని జంగిల్ ఆనంద్ శంకర్ అనే వ్యక్తి ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. సఫారీకి వచ్చే టూరిస్ట్ లు అక్కిడి గైడ్ మాట, డ్రైవర్ మాట వినరని, వారు పిల్లలతో వచ్చి ప్రమాదాలతో చెలగాటం ఆడతారని ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన ఫోటోకు పెట్టిన క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. పులి అంత దూరం దూకడానికి ఒక్క సెకెను కూడా పట్టదు. జీప్ సడెన్ గా స్టార్ట్ చేసినా జీప్ మీద కూర్చున్న ప్రయాణికులు బ్యాలెన్స్ తప్పి పడిపోవచ్చు. పిల్లలతో సఫారీకి వచ్చి ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతాయి. ఇలాగే చేస్తూ పోతే ప్రభుత్వాలు ఫారెస్ట్ సఫారీలు రద్దు చేస్తుంది. అంటూ ఆనంద్ శంకర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.