Viral News: చనిపోయిన తండ్రి ఫోన్‌నెంబర్‌కు మెసేజ్ చేసిన కూతురు.. వచ్చి రిప్లై చూస్తే షాకే..!
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:48 PM
Viral News: అయిన వాళ్లను కోల్పోతే, అందులోనూ తల్లిదండ్రులను కోల్పోతే కలిగే బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఏదో ఒక సందర్భంలో తమ పేరెంట్స్‌ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంటారు. ముఖ్యంగా ఓ కూతురు, తండ్రి మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకం.
Viral News: అయిన వాళ్లను కోల్పోతే, అందులోనూ తల్లిదండ్రులను కోల్పోతే కలిగే బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఏదో ఒక సందర్భంలో తమ పేరెంట్స్‌ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంటారు. ముఖ్యంగా ఓ కూతురు, తండ్రి మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకం. అలాంటి కూతురు తన తండ్రిని కోల్పోతే.. నాన్న లేడన్న విషయాన్నే జీర్ణించుకోలేరు. ఈ క్రమంలోనే తండ్రిని కోల్పోయిన ఓ మహిళ.. తన తండ్రికి సంబంధించిన పాత ఫోన్ నెంబర్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్‌కి ఊహించని విధంగా రిప్లై వచ్చింది. ఇది చూసి సర్‌ప్రైజ్ అయ్యింది ఆ మహిళ. ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’లో ఓ మహిళ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. వాస్తవానికి ఆమె తండ్రి 2020లో చనిపోయారు. తండ్రి దూరమవడాన్ని ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల తన తండ్రికి సంబంధించిన పాత మొబైల్ నెంబర్‌కు టెక్ట్స్ మెసేజ్ చేసింది. అయితే, ఆ నెంబర్ నుంచి ఊహించని విధంగా మళ్లీ ఆమెకు రిప్లై వచ్చింది. దీంతో షాక్ అయింది మహిళ.
ముందుగా ఆ మహిళ ‘నాన్నా.. నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాను.’ అంటూ మెసేజ్ పంపింది. దీనికి ప్రతి స్పందనగా అటునుంచి ‘??’ రిప్లై ఇచ్చారు. దీంతో షాక్ అయిన మహిళ.. తన తండ్రి నెంబర్‌ను వేరొకరికి అలాట్ చేసి ఉండొచ్చని గ్రహించి.. ఇది తన తండ్రి పాత ఫోన్ నెంబర్ అని, 2020లో ఆయన చనిపోయారని రిప్లై ఇస్తూ మెసేజ్ చేసింది. ‘లాల్, రిప్లై వస్తుందని భావించలేదు’ అని కూడా మెసేజ్ పెట్టింది.
ఈ మెసేజ్‌కు కూడా అవతలి వైపు నుంచి సానుకూల రిప్లై ఇచ్చారు. ‘నా పిల్లి అల్లరి పనులు చూస్తారా’ అని మేసేజ్ పెట్టారు. దీనికి మహిళ ‘ఎస్’ అని రిప్లై ఇచ్చింది. అవతలి వైపు నుంచి ఆవలిస్తున్న నల్ల పిల్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. అది చూసి మహిళ హ్యాపీగా ఫీలయ్యింది. ఆ ఫోటోకి లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. కాగా, ఈ చాట్‌ను మహిళ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు వారిని మర్చిపోవడం చాలా కష్టం అని కామెంట్స్ పెడుతున్నారు.