Share News

గాలితో ‘నడిచే శిల్పాలు’

ABN , Publish Date - Aug 18 , 2024 | 10:17 AM

బీచ్‌లో జంతువులు పరుగెడుతున్నట్టుగా కనిపిస్తాయి ఆయన రూపొందించిన ‘స్ట్రాండ్‌బీస్ట్‌’లను చూస్తే. అలాగని అవి ఏ మోటారుతోనో, బ్యాటరీతోనో నడుస్తున్నాయనుకుంటే పొరపడినట్టే. నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు థియో జాన్సన్‌ సృజనాత్మకంగా రూపొందించిన నడిచే శిల్పాలివి.

గాలితో ‘నడిచే శిల్పాలు’

బీచ్‌లో జంతువులు పరుగెడుతున్నట్టుగా కనిపిస్తాయి ఆయన రూపొందించిన ‘స్ట్రాండ్‌బీస్ట్‌’లను చూస్తే. అలాగని అవి ఏ మోటారుతోనో, బ్యాటరీతోనో నడుస్తున్నాయనుకుంటే పొరపడినట్టే. నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు థియో జాన్సన్‌ సృజనాత్మకంగా రూపొందించిన నడిచే శిల్పాలివి. కళాకారుడైన థియో జాన్సన్‌ భౌతికశాస్త్ర పరిశోధకుడిగా మారి వీటిని రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణాలు కేవలం గాలితో ముందుకు కదులుతుంటాయి.


nani6.jpg

దూరం నుంచి చూస్తే జంతువులు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే వీటికి ‘స్ట్రాండ్‌బీస్ట్‌’లు అని పేరు పెట్టారు. అంటే ‘బీచ్‌ జంతువులు’ అని అర్థం. వీటిని రూపొందించడానికి జాన్సన్‌ ముందుగా అల్గారిథమ్‌ రాసుకుంటారు. ఆతర్వాతే తయారీకి సిద్ధమవుతారు. బీచుల్లో ఈ సరికొత్త కళాఖండాలను చూసేందుకు జనం ఎగబడుతుంటారు.

Updated Date - Aug 18 , 2024 | 10:17 AM