Share News

Washing Machine: ఈ 4 సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. వాషింగ్ మెషీన్ కొత్తదానిలా పనిచేయడమే కాదు.. మన్నిక కూడా పెరుగుతుంది!

ABN , Publish Date - Jan 24 , 2024 | 02:15 PM

వాషింగ్ మెషీన్లు వాడే చాలామందికి తెలియని నిజాలివీ..

Washing Machine:  ఈ 4 సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. వాషింగ్ మెషీన్ కొత్తదానిలా పనిచేయడమే కాదు.. మన్నిక కూడా పెరుగుతుంది!

వాషింగ్ మెషీన్లు ఇప్పట్లో సగటు మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో కూడా ఉంటున్నాయి. ఇవి మహిళలకు ఎంతో పని తగ్గిస్తున్నాయనే చెప్పవచ్చు. అయితే వాషింగ్ మెషీన్లు మొదట కొన్నప్పటిలా తరువాత పనిచేయడం లేదని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. సాధారణంగా వాషింగ్ మెషీన్ ఉపయోగించిన తరువాత లైమ్ స్కేల్ బిల్డప్ అవుతుంది. అసలు లైమ్ స్కేల్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే నష్టమేంటి? వాషింగ్ మెషీన్ బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..

వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికిన తరువాత దాన్ని శుభ్రం చేయకపోతే అందులో ఖనిజాలు పేరుకుపోతాయి. దీని వల్ల క్రమంగా వాషింగ్ మెషీన్ లోపలి భాగాలు కూడా పాడవుతాయి. మెషీన్ నుండి నీరు లీక్ అవ్వడం, పనితీరు సరిగా లేకపోవడం, వాషింగ్ మెషీన్ బయటి భాగాలు చీలడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వాషింగ్ మెషీన్లో బట్టలు ఎప్పుడు ఉతికినా చక్కగా శుభ్రం కావాలన్నా, మెషీన్ ఎక్కువ రోజులు మన్నిక రావాలన్నా దాన్ని డీస్కెల్ చేయాలి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ అయినా, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ అయినా నాలుగు సింపుల్ టిప్స్ తో వాషింగ్ మెషీన్ ను డీస్కేల్ ఎలా చేయచ్చంటే..

ఇది కూడా చదవండి: Indian Dishes: ప్రపంచ 100 ఉత్తమ వంటకాలలో మనవీ ఓ నాలుగు.. ఘుమఘుమల జాబితాలోని భారత్ ఆహారాలివే..!



స్టెప్ 1..

మొదటగా వాషింగ్ మెషీన్ లిక్విడ్ డీస్కేలర్ కొనుగోలు చేయాలి. వాషర్ డిటర్జెంట్ డిస్పెన్సర్ లో సూచించిన మొత్తాన్ని అందులో పోయాలి. ఎంత మోతాదు వెయ్యాలి, సూచనలేంటనేవి డీస్కేలర్ ప్యాకేజీపై స్పష్టంగా ఉంటుంది. దాన్ని అనుసరించాలి.

స్టెప్ 2..

లైమ్ స్కేల్ తొలగింపు అంటే వాషింగ్ మెషీన్లో పేరుకున్న ఖనిజాలు తొలగించేందుకు నీటి ఉష్ణోగ్రత కూడా చూసుకోవాలి. కనీసం 60డిగ్రీల వరకు నీటి చక్రాన్ని సెట్ చెయ్యాలి.

స్టెప్ 3..

వాషింగ్ మెషీన్ లైమ్ స్కేల్ తొలగించే ప్రక్రియ చేసేటప్పుడు వాషింగ్ మెషీన్ ఖాళీగా ఉండాలి. అందులో ఎలాంటి వస్తువులు లేదా దుస్తులు ఉండకూడదు. లోపల ఎలాంటి డిటర్జెంట్ జాడలు లేకుండా చూసుకోవాలి.

స్టెప్ 3..

పై ప్రక్రియలు అన్నీ చేసిన తరువాత స్టార్ట్ బటన్ పై క్లిక్ చేస్తే డీస్కేలర్ అవుతుంది.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!


వాషింగ్ మెషీన్ ను ఎన్నిరోజులకు ఒకసారి డీస్కేల్ చెయ్యాలంటే..

వాషింగ్ మెషీన్ ఎక్కువరోజులు మన్నికగా పనిచేయాలంటే కనీసం సంవత్సరంలో 3 నుండి 4 సార్లు డీస్కేల్ చేయాలి. ఇది మాత్రమే కాదు.. వాషింగ్ మెషీన్ వాడకం పై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. వాషింగ్ మెషీన్ కు ఉపయోగించే నీరు ఉప్పు నీరు అయినా, నీరు స్వచ్చంగా లేకపోయినా వాషింగ్ మెషీన్ ను తరచుగా డీస్కేల్ చేయడం మంచిది.

ఇది కూడా చదవండి: మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే లెక్క!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 02:20 PM