Share News

Working Life: ఆఫీసు పని భారంగా అనిపిస్తోందా? ఈ 4 చిట్కాలు ఫాలో అయ్యి చూడండి..!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:04 PM

ఆఫీసు పని వల్ల కలిగే ఒత్తిడి కాస్తా వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. 4 టిప్స్ తో దీన్ని డీల్ చేయవచ్చు.

Working Life: ఆఫీసు పని భారంగా అనిపిస్తోందా? ఈ 4 చిట్కాలు ఫాలో అయ్యి చూడండి..!

ఇప్పట్లో విద్య, ఉద్యోగం మొదలైన విషయాలలో ప్రజలు ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. సంపాదన వేటలో ఎంత కష్టమైన ఉద్యోగం అయినా చేయడానికి వెనుకాడటం లేదు. అయితే చాలామంది ఉద్యోగం విషయంలో ఒత్తిడి ఫీలవుతుంటారు. ఆఫీసు పని చేయడానికి భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఆఫీసు పని వల్ల కలిగే ఒత్తిడి కాస్తా వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీంతో రెండూ గందరగోళానికి గురిచేస్తాయి. అటు ఆఫీసు పని, ఇటు వ్యక్తిగత జీవితం రెండూ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే 4 సింపుల్ చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..

సమయాన్ని విభజించుకోవాలి..

పని విషయంలో ఒత్తిడి, ఆందోళన నివారించడానికి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఫాలో అవ్వాలి. చేసే పనిని బట్టి దానికి సమయాన్ని కేటాయించుకోవాలి. చేయాలనుకునే పనులు, చేయాల్సిన పనులను షెడ్యూల్ వేసుకుంటే సమయాన్ని బాగా మేనేజ్ చేసుకోవచ్చు.

ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!


నిద్ర..

పని వల్ల అలసిపోయిన శరీరం తిరిగి చురుగ్గా మారడానికి నిద్ర ఎంతగానో సహాకరిస్తుంది. ఒత్తిడి నుండి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ సరిపడినంత నిద్ర లేకపోతే ఆఫీసు పనులు చేయడంలో ఒత్తిడి ఫీలవుతుంటారు. అందుకే గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

విశ్రాంతి..

విశ్రాంతి మెదడును అలసిపోకుండా చేస్తుంది. పనులు చేసేటప్పుడు చిన్న బ్రేకింగ్స్ తీసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే పనుల విషయంలో ఉండే ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో చిన్నపాటి విశ్రాంతి సమయాలు చాలా సహాయం చేస్తాయి. ఈ విశ్రాంతి సమయంలో కూడా నచ్చినవారితో ఆందోళన తగ్గించే దిశగా మాట్లాడటం మంచిది.

ధ్యానం..

ధ్యానానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని డీల్ చేస్తుంది. మెదడు పనితీరును దృఢంగా మారుస్తుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం, వాకింగ్ మొదలైనవి ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలోనూ, ఆఫీసు పనిని చక్కగా నిర్వహించడంలోనూ సహాయపడతాయి.

రోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 04:04 PM