Share News

పదికి పది

ABN , Publish Date - Nov 16 , 2024 | 06:30 AM

హరియాణా జట్టు పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ అరుదైన రికార్డు సాధించాడు. కేరళతో రంజీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. దీంతో రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన

పదికి పది

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు

హరియాణా పేసర్‌ అన్షుల్‌ అరుదైన రికార్డు

లాహ్లి(హరియాణా): హరియాణా జట్టు పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ అరుదైన రికార్డు సాధించాడు. కేరళతో రంజీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. దీంతో రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా 23 ఏళ్ల అన్షుల్‌ ఘనత వహించాడు. గతంలో బెంగాల్‌కు చెందిన ప్రేమాగ్షు చటర్జీ (1953లో అసోంపై), రాజస్థాన్‌ క్రికెటర్‌ ప్రదీప్‌ సుందరం (1985లో విదర్భపై) రంజీల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లా్‌సలో ఈ రికార్డు సాధించిన ఆరో భారత బౌలర్‌గా అన్షుల్‌ నిలిచాడు. కేరళతో పోరులో 30.1 ఓవర్లు వేసిన అన్షుల్‌.. 49 పరుగులు మాత్రమే సమర్పించుకొని 10 వికెట్లు తీశాడు. ఫలితంగా కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 291 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో హరియాణా శుక్రవారం ఆట ముగిసేసరికి 139/7 స్కోరు చేసింది. ఇక, ఇప్పటిదాకా 19 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన అన్షుల్‌ తాజా ప్రదర్శనతో కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Updated Date - Nov 16 , 2024 | 06:30 AM