Share News

Paris Olympics : ఆ పోటీలు.. 16వేల కిలో మీటర్ల దూరంలో

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:05 AM

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓ క్రీడా ఈవెంట్‌ మాత్రం ఆతిథ్య నగరానికి వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తుండడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Paris Olympics : ఆ పోటీలు.. 16వేల కిలో మీటర్ల దూరంలో

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓ క్రీడా ఈవెంట్‌ మాత్రం ఆతిథ్య నగరానికి వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తుండడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ఫింగ్‌ ఈవెంట్‌ను పసిఫిక్‌ మహా సముద్రంలో ఉన్న ఫ్రెంచ్‌ పాలినేషియన్‌ ద్వీపం తాహితీలోని చిరుప్రాంతమైన టీహుపో తీరంలో నిర్వహిస్తున్నారు. ఇది క్రీడలకు ఆతిథ్యమిస్తున్న పారి్‌సకు ఏకంగా 15,715 కిలోల మీటర్ల దూరంలో ఉంది. ఒలింపిక్స్‌లో ఓ క్రీడను ఆతిథ్య నగరానికి ఇంత దూరంలో నిర్వహించడం 68 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా సర్ఫింగ్‌ ఈవెంట్‌ను సముద్ర తీరంలోని అలలపై నిర్వహిస్తారు. అయితే పారి్‌సకు సమీపంలో సముద్రం లేదు. దీంతో ఫ్రాన్స్‌లోనే భాగమైన టీహుపో తీరంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 06:05 AM