Home » Paris Olympics 2024
క్వార్టర్ ఫైనల్స్ వరకు అర్హత సాధించిన తైవాన్ మహిళా బాక్సర్ ఫైనల్స్ కు వెళ్లకుండానే వెనుదిరిగింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైలిల్ గెలిచిన ఆమె జెండర్ కు సంబంధించిన వివాదం ఎదుర్కొంటోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా స్వర్ణ పతక పోరు ఆడకుండా అనర్హత విధించిన తర్వాత పారిస్‌లో తనకు మద్దతు లభించలేదని ఆమె అన్నారు.
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అత్యధికంగా 2.08 మీటర్ల జంప్ చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. దీంతో ఇండియాకు ఆరో బంగారు పతకాన్ని అందించాడు.
పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురుషుల 60 కేజీల J1 ఈవెంట్‌లో కాంస్య పతక పోరులో కపిల్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిటన్ డి ఒలివెరాపై విజయం సాధించి కాంస్యం సాధించాడు.
ప్రపంచ ఛాంపియన్ భారత అథ్లెట్ సచిన్ ఖిలారీ బుధవారం పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల షాట్‌పుట్ F46 ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 34 ఏళ్ల భారత పారా అథ్లెట్ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్ల ఆసియా రికార్డుతో పతకం సాధించింది.
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ 2024లో నితేష్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ (Nitish Kumar) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో గోల్డ్ పతకాన్ని అందించాడు.
పారాలింపిక్స్ 2024లో ఐదో రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా(Yogesh Kathuniya) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో యోగేష్ రజత పతకాన్ని సాధించగా, దేశం మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది.
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్‌కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం గెల్చుకున్నాడు. మరోవైపు మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.