John Cena: లెజెండ్ రెజ్లర్ జాన్ సెనా సంచలన ప్రకటన.. 20 ఏళ్ల కెరీర్..
ABN , Publish Date - Jul 07 , 2024 | 12:19 PM
WWE రెజ్లర్ ఛాంపియన్ జాన్ సెనా(John Cena) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2002లో WWEలో అడుగుపెట్టిన జాన్ సెనా.. ఆ తర్వాత 20 ఏళ్లకు పైగా తన పోరాటాలతో అభిమానులను అలరించాడు.
WWE రెజ్లర్ ఛాంపియన్ జాన్ సెనా(John Cena) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2002లో WWEలో అడుగుపెట్టిన జాన్ సెనా.. ఆ తర్వాత 20 ఏళ్లకు పైగా తన పోరాటాలతో అభిమానులను అలరించాడు. WWE రింగ్‌లో జాన్ సెనా, ది రాక్, ట్రిపుల్ హెచ్, రాండీ ఓర్టన్ వంటి రెజ్లింగ్ లెజెండ్‌లతో విపరీంగా పోరాడి WWE ఛాంపియన్‌షిప్‌లను 13 సార్లు గెల్చుకున్నాడు. అంతేకాదు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను మూడు వేర్వేరు సందర్భాలలో దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో WWEలో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న పరంగా జాన్ సెనా లెజెండరీ రెజ్లర్ రిక్ ఫ్లెయిర్‌తో సమానంగా ఉన్నాడు.
ప్రస్తుతం జాన్ సెనా వయసు 47 ఏళ్లు కాగా, WWEలో ప్రదర్శనతో పాటు తన హాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టడం జాన్ సెనాకు చాలా కష్టంగా మారింది. ఈ కారణంగా జాన్ సెనా WWE రింగ్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. టొరంటోలో మనీ ఇన్ ది బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సందర్భంగా జాన్ సెనా ఈ ప్రకటన చేశాడు. అక్కడ జాన్ సెనా 'ది లాస్ట్ టైమ్ ఈజ్ నౌ' అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించాడు. ఈ క్రమంలో 47 ఏళ్ల జాన్ సెనా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో 2025 తన చివరి సంవత్సరమని వెల్లడించారు. అయితే ప్రస్తుతం జాన్ సెనా మొదటి రా ఎపిసోడ్‌లో నటిస్తున్నాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
జాన్ సెనా(John Cena) ఫిబ్రవరిలో రాయల్ రంబుల్, మార్చిలో ఎలిమినేషన్ ఛాంబర్, లాస్ వెగాస్‌లో అతని చివరి WWE రెజిల్‌మేనియా మ్యాచ్‌ని ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే తాను WWE నుంచి రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2025లో జరిగే రెసిల్ మేనియా 41 తన చివరి మ్యాచ్ అని జాన్ సెనా స్పష్టం చేశారు. WWE నుంచి రిటైర్ అయిన తర్వాత, జాన్ సెనా తన హాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టనున్నారు. జాన్ సెనా WWEలో గొప్ప కెరీర్‌ను కలిగి ఉన్నాడు. జాన్ సెనా తన కెరీర్‌లో 16 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉండటమే కాకుండా, మనీ ఇన్ బ్యాంక్, రాయల్ రంబుల్ విజేతగా కూడా నిలిచాడు.
ఇది కూడా చదవండి:
Viral Video: ఎంఎస్ ధోని పాదాలకు మొక్కిన సాక్షి సింగ్
స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేత వినేశ్
Hardik Pandya: నీతా అంబానీ తీవ్ర భావోద్వేగం
Read Latest Sports News and Telugu News