Share News

ఒకే ఓవర్‌లో 37 పరుగులు

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:28 AM

భారత మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప బౌలింగ్‌ను ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రవి బొపార ఉతికారేశాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులతో చెలరేగాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య శనివారం జరిగిన హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో...

ఒకే ఓవర్‌లో 37 పరుగులు

ఊతప్పను ఉతికారేసిన బొపార

హాంకాంగ్‌: భారత మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప బౌలింగ్‌ను ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రవి బొపార ఉతికారేశాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులతో చెలరేగాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య శనివారం జరిగిన హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో ఈ పరుగుల పండుగ చోటుచేసుకుంది. ఊతప్ప వేసిన ఓవర్లో తొలి 5 బంతుల్లో బొపార 5 సిక్సర్లు బాదాడు. ఊతప్ప ఆరో బంతిని వైడ్‌గా వేయడంతో..అదనంగా మరో బంతి లభించింది. దానిని కూడా బొపార సిక్సర్‌గా మలచడంతో..ఓవర్‌లో 37 రన్స్‌ దక్కాయి. ఈక్రమంలో బొపార 14 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. దాంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 6 ఓవర్లలో 120/1 స్కోరు చేసింది. ఛేదనలో ఊతప్ప కెప్టెన్సీలోని భారత్‌ 6 ఓవర్లలో 105/3కే పరిమితమై ఓటమిపాలైంది.

Updated Date - Nov 03 , 2024 | 01:28 AM