అలాస్కన్‌కు ముంబా షాక్
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:04 AM
టేబుల్ టాపర్ అలాస్కన్ నైట్స్‌కు అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్ షాకిచ్చింది. గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ముంబా మాస్టర్స్ 10-9తో అలాస్కన్ నైట్స్‌పై నెగ్గింది...
లండన్ : టేబుల్ టాపర్ అలాస్కన్ నైట్స్‌కు అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్ షాకిచ్చింది. గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ముంబా మాస్టర్స్ 10-9తో అలాస్కన్ నైట్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ముంబా జట్టు నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో..త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ 12-9తో గ్యాంజీస్ గ్రాండ్‌మాస్టర్స్‌ని, ఆల్‌పైన్ పైపర్స్ 11-6తో అమెరికన్ గ్యాంబిట్స్‌ని ఓడించాయి.