Share News

నాకంటే వెయ్యి రెట్లు ఉత్తమం

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:47 AM

స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజా ప్రపంచక్‌పలో అతడు వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు...

నాకంటే వెయ్యి రెట్లు ఉత్తమం

బుమ్రాకు కపిల్‌ ప్రశంస

న్యూఢిల్లీ: స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజా ప్రపంచక్‌పలో అతడు వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు. అందుకే బుమ్రా తనకంటే వెయ్యి రెట్లు అద్భుతమైన బౌలర్‌గా కితాబిచ్చాడు. ఇప్పటి ఆటగాళ్లలో చక్కటి నైపుణ్యం ఉందని, అనుభవం గడించేకొద్దీ మరింత రాటుదేలుతారని తేల్చాడు. ఫిట్‌నె్‌సను కాపాడుకోవడంలోనూ తీవ్రంగా శ్రమిస్తుండడం శుభ పరిణామమని, అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా రాణించేందుకు ఇదెంతో దోహదపడుతుందని కపిల్‌ చెప్పుకొచ్చాడు.

Updated Date - Jun 28 , 2024 | 04:47 AM