Share News

Afghanistan vs Zimbabwe : అఫ్ఘాన్‌దే వన్డే సిరీస్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:48 AM

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో అఫ్ఘానిస్థాన్‌ 8 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను అఫ్ఘాన్‌ 2-0తో దక్కించుకుంది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యింది.

Afghanistan vs Zimbabwe : అఫ్ఘాన్‌దే వన్డే సిరీస్‌

హరారే: జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో అఫ్ఘానిస్థాన్‌ 8 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను అఫ్ఘాన్‌ 2-0తో దక్కించుకుంది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యింది. ముందుగా జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. షాన్‌ విలియమ్స్‌ (60) రాణించాడు. 18 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్‌ ఘజన్‌ఫర్‌ 5 వికెట్లతో ఆకట్టుకోగా రషీద్‌కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో అఫ్ఘాన్‌ 26.5 ఓవర్లలో 2 వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ సెడికుల్లా అటల్‌ (52) అర్ధసెంచరీ సాధించాడు.

Updated Date - Dec 22 , 2024 | 06:48 AM