22 ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Nov 11 , 2024 | 02:20 AM
మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో తొలిసారి బరిలోకి దిగిన పాకిస్థాన్ వన్డే జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను 2-1తో దక్కించుకుంది. అలాగే 22 ఏళ్ల (2002) తర్వాత...
ఆసీస్ గడ్డపై పాక్‌కు సిరీస్
మూడో వన్డేలో ఘనవిజయం
పెర్త్: మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో తొలిసారి బరిలోకి దిగిన పాకిస్థాన్ వన్డే జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను 2-1తో దక్కించుకుంది. అలాగే 22 ఏళ్ల (2002) తర్వాత పాక్ జట్టు కంగారూ గడ్డపై సిరీస్ సాధించింది. అలాగే ఓ వన్డే సిరీ్‌సలో ఆసీస్ నుంచి ఏ ఒక్క బ్యాటర్ కూడా అర్ధసెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి. పేసర్లు షహీన్, నసీమ్ షా మూడేసి వికెట్లతో కట్టడి చేయగా, ఆసీస్ 31.5 ఓవర్లలో 140 పరుగులే చేసింది. ఎబాట్ (30) టాప్‌స్కోరర్. ఛేదనలో పాక్ 26.5 ఓవర్లలో 143/2 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37), రిజ్వాన్ (30 నాటౌట్), బాబర్ (28 నాటౌట్) రాణించారు. మోరి్‌సకు 2 వికెట్లు దక్కాయి.