Share News

27 ఏళ్ల తర్వాత.. ఇరానీ విజేత ముంబై

ABN , Publish Date - Oct 06 , 2024 | 02:19 AM

ముంబై జట్టు 27 ఏళ్ల సుదీర్ఘ విరామానంతరం ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. రెస్టాఫ్‌ ఇండియాతో డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా టైటిల్‌ ముంబై వశమైంది...

27 ఏళ్ల తర్వాత.. ఇరానీ విజేత ముంబై

రెస్టాఫ్‌ ఇండియాతో మ్యాచ్‌ డ్రా

లఖ్‌నవూ: ముంబై జట్టు 27 ఏళ్ల సుదీర్ఘ విరామానంతరం ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. రెస్టాఫ్‌ ఇండియాతో డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా టైటిల్‌ ముంబై వశమైంది. ఆ జట్టు తొలిసారి 1997-98లో ఈ టైటిల్‌ గెలిచింది. ఆటకు ఆఖరి రోజైన శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 153/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబై 329/8 వద్ద డిక్లేర్‌ చేసి, ప్రత్యర్థి ముందు 451 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తనుష్‌ కోటియన్‌ (114 నాటౌట్‌) అద్భుత ఆటతీరుతో శతకం సాధించాడు. అయితే చివరిరోజు ఒకే సెషన్‌ ఆట మిగిలిన పరిస్థితుల్లో రెస్టాఫ్‌ ఇండియా కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ డ్రాకు అంగీకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 537 పరుగులు చేయగా.. రెస్టాఫ్‌ ఇండియా 416 రన్స్‌ సాధించింది. డబుల్‌ సెంచరీ చేసిన సర్ఫరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

Updated Date - Oct 06 , 2024 | 02:19 AM