Share News

ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో ఆగ్రా!

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:06 AM

ఒలింపిక్స్‌ (2036) ఆతిథ్యానికి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ దాఖలు చేసిన భారత్‌ అందుకోసం ప్రయత్నాలను ముమ్మురం చేసింది.

ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో ఆగ్రా!

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ (2036) ఆతిథ్యానికి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ దాఖలు చేసిన భారత్‌ అందుకోసం ప్రయత్నాలను ముమ్మురం చేసింది. మరోవైపు ఒలింపిక్‌ ఆతిథ్య నగరంగా ఇప్పటికే అహ్మదాబాద్‌ రేసులో ముందు నిలిచింది. అలాగే ముంబై పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)-ఆగ్రా ఆతిథ్య నగరంగా ఉండనుందనే వార్తలు బలంగా వినవస్తున్నాయి. ఇందుకు 4 కారణాలను ప్రధానంగా చూపుతున్నారు. 1. దేశంలోని పలు ప్రధాన పర్యాటక కేంద్రాలకు సమీపంలో ఉండడం. 2. ఢిల్లీ-ఆగ్రాల సమీపంలో నాలుగు విమానాశ్రయాలుండడం. 3. నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉండడం. 4. ఆగ్రా నగరం బిడ్డింగ్‌ రేసుకు మరింత విలువ తెస్తుందని భావించడం.

Updated Date - Nov 21 , 2024 | 06:06 AM