Share News

Andhra Shooters : ప్రణవి, ముకేష్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:36 AM

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్ర షూటర్లు ప్రణవి, ముకే్‌ష ద్వయం రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన 10 మీటర్ల

Andhra Shooters : ప్రణవి, ముకేష్‌ డబుల్‌ ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్ర షూటర్లు ప్రణవి, ముకే్‌ష ద్వయం రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టర్‌ మిక్స్‌డ్‌ విభాగం సీనియర్‌, జూనియర్‌ కేటగిరీల్లో ప్రణవి (ఒంగోలు), ముకేష్‌ (గుంటూరు) జోడీ ఈ పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్‌ విభాగంలో ప్రణవి-ముకేష్‌ ద్వయం 577 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. జూనియర్‌ విభాగంలో ఈ జోడీ 576 పాయింట్లతో రజతంతో మెరిసింది.

Updated Date - Dec 22 , 2024 | 06:36 AM