హైదరాబాద్‌కు మరో ఓటమి
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:52 AM
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గ్రూప్-సిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర చేతిలో చిత్తయింది. తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 244/8 స్కోరు చేసింది...
అహ్మదాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గ్రూప్-సిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర చేతిలో చిత్తయింది. తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 244/8 స్కోరు చేసింది. తిలక్ వర్మ (57), అవనీష్ (52) రాణించారు. అనంతరం సౌరాష్ట్ర 42.5 ఓవర్లలో 4 వికెట్లకు 248 రన్స్ చేసి గెలిచింది. హర్విక్ దేశాయ్ (125 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. ముంబైలో జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు సిక్కింపై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా యూపీ అండర్-23 జట్టు రికార్డులకెక్కింది. స్టేట్-ఎ వన్డే ట్రోఫీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో విదర్భ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని యూపీ 41.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.