Share News

అర్జున్‌కు షాక్‌

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:21 AM

అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న తెలుగు కుర్రాడు ఇరిగేసి అర్జున్‌కు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో అరవింద్‌ చిదంబరం (తమిళనాడు) షాకిచ్చాడు. ఆదివారం జరిగిన గేమ్‌లో 48వ ఎత్తుల్లో అర్జున్‌కు అరవింద్‌ చెక్‌ చెప్పాడు...

అర్జున్‌కు షాక్‌

చెన్నై: అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న తెలుగు కుర్రాడు ఇరిగేసి అర్జున్‌కు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో అరవింద్‌ చిదంబరం (తమిళనాడు) షాకిచ్చాడు. ఆదివారం జరిగిన గేమ్‌లో 48వ ఎత్తుల్లో అర్జున్‌కు అరవింద్‌ చెక్‌ చెప్పాడు. లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా)తో గేమ్‌ను విదిత్‌ సంతోష్‌ గుజరాతి డ్రా చేసుకున్నాడు. ఆరో రౌండ్‌ అనంతరం అర్జున్‌, లెవాన్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా, అరవింద్‌ రెండో స్థానంలో ఉన్నాడు. సోమవారం ఆఖరిదైన ఏడో రౌండ్‌ జరగనుంది. చెన్నై చాలెంజర్స్‌ చెస్‌ టోర్నీలో రౌనక్‌ సాధ్వానితో జరిగిన ఆరో రౌండ్‌ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించింది. మొత్తంగా 6 రౌండ్లు ముగిసేసరికి ప్రణవ్‌ టాప్‌లో ఉండగా, హారిక 7వ స్థానంలో నిలిచింది.

Updated Date - Nov 11 , 2024 | 02:21 AM