Robin Uthappa : ఊతప్పపై అరెస్ట్ వారెంట్
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:52 AM
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు జమ
బెంగళూరు: భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు జమ చేయకుండా మోసం చేసినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రాబిన్‌పై ఈనెల నాలుగునే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌కు 39 ఏళ్ల రాబిన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాల నుంచి రూ. 23.36 లక్షలు మినహాయించినా, అవి వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో రీజినల్ పీఎఫ్ కమిషనర్ గోపాల్ రెడ్డి అతడికి నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో రాబిన్‌పై వారెంట్ జారీ కావడమే కాకుండా, ఈనెల 27లోగా వారికివ్వాల్సిన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో అరెస్ట్ తప్పదని హెచ్చరించారు.