Share News

డబ్ల్యూటీసీలో కనీసం 3 టెస్టులు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:43 AM

టెస్టు, వన్డే ఫార్మాట్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ నడుం బిగించింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ పలు సూచనలను ప్రతిపాదించింది...

డబ్ల్యూటీసీలో కనీసం 3 టెస్టులు

ఐసీసీ క్రికెట్‌ కమిటీ సూచన

దుబాయ్‌: టెస్టు, వన్డే ఫార్మాట్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ నడుం బిగించింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ పలు సూచనలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వచ్చే అంచె నుంచి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ)లో కనీసం మూడు టెస్టుల సిరీ్‌సను ఆడించాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు రెండు టెస్టుల సిరీస్‌కే పరిమితమవుతున్నాయని ఐసీసీ భావిస్తోంది. అలాగే ఆతిథ్యమిచ్చే జట్లు మరిన్ని డే/నైట్‌ టెస్టులు నిర్వహించేలా చూడాలని కోరింది. ఇక, వన్డేల్లో తొలి 25 ఓవర్లలో రెండు కొత్త బంతులను, ఆ తర్వాత ఒక్క బంతిని మాత్రమే వాడాలని క్రికెట్‌ కమిటీ సూచించింది. దీంతో పేసర్లకు రివర్స్‌స్వింగ్‌తో పాటు స్పిన్నర్లకు కూడా ప్రయోజకరంగా ఉంటుందని భావిస్తోంది. అలాగే ఐసీసీ చైర్మన్‌ పదవి కూడా ఇకనుంచి మూడేళ్లపాటు ఉండనుంది.

Updated Date - Oct 23 , 2024 | 12:43 AM