Border-Gavaskar Trophy : టీనేజర్ కొన్‌స్టాస్‌కు చోటు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:04 AM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జాబితాలో 19 ఏళ్ల టీనేజ్ సంచలనం సామ్ కొన్‌స్టా్‌సకు చోటు దక్కింది. దీంతో 71 ఏళ్ల తర్వాత ఆసీస్
భారత్‌తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టు
మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జాబితాలో 19 ఏళ్ల టీనేజ్ సంచలనం సామ్ కొన్‌స్టా్‌సకు చోటు దక్కింది. దీంతో 71 ఏళ్ల తర్వాత ఆసీస్ టెస్టు జట్టులో బెర్త్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 1953లో ఇయాన్ క్రెగ్ 17 ఏళ్ల వయస్సులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడాడు. ఒకవేళ బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా అరంగేట్రం చేస్తే.. కమిన్స్ (2011లో 18 ఏళ్ల వయస్సులో) తర్వాత ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. భారత్ ‘ఎ’పై సామ్ అజేయంగా 73 రన్స్ చేయడంతో పాటు, పీఎం ఎలెవన్ జట్టు తరఫున సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మెక్‌స్వీనేపై వేటు పడింది. గాయపడిన పేసర్ హాజెల్‌వుడ్ స్థానంలో జే రిచర్డ్‌సన్ జట్టులోకి వచ్చాడు. కమిన్స్‌కు డిప్యూటీలుగా స్మిత్, హెడ్ వ్యవహరిస్తారు.
ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్ (కెప్టెన్), హెడ్, ఖవాజా, స్మిత్, లబుషేన్, క్యారీ, ఎబాట్, బోలాండ్, ఇన్‌గ్లి్‌స, కొన్‌స్టా్‌స, లియోన్, మార్ష్, రిచర్డ్‌సన్, స్టార్క్, వెబ్‌స్టర్.