Share News

Vijay Hazare Trophy : శతక్కొట్టిన అవనీష్‌ .. హైదరాబాద్‌ బోణీ

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:46 AM

అవనీష్‌ (100) శతకంతో విజృంభించడంతో.. విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ చేసింది. గ్రూప్‌-సిలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై

Vijay Hazare Trophy : శతక్కొట్టిన అవనీష్‌ .. హైదరాబాద్‌ బోణీ

అహ్మదాబాద్‌: అవనీష్‌ (100) శతకంతో విజృంభించడంతో.. విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ చేసింది. గ్రూప్‌-సిలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై గెలిచింది. తొలుత హైదరాబాద్‌ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ గౌడ్‌ (57), తన్మయ్‌ అగర్వాల్‌ (51) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. లిమ్లివటి లెమ్‌టుర్‌ 4, జొనాథన్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నాగాలాండ్‌ ఓవర్లన్నీ ఆడి 234/8 స్కోరు మాత్రమే చేసింది. యుగంధర్‌ (80), సుచిత్‌ (66) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. నిశాంత్‌, ముదస్సర్‌ చెరో 2 వికెట్లు కూల్చారు

Updated Date - Dec 22 , 2024 | 06:46 AM