బజ్‌రంగ్‌పై నాలుగేళ్ల నిషేధం
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:09 AM
డోప్ పరీక్షకు మూత్రం నమూనా ఇచ్చేందుకు నిరాకరించిన స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కొరడా ఝళిపించింది. అతడిని ఏకంగా నాలుగు సంవత్సరాలు...
న్యూఢిల్లీ: డోప్ పరీక్షకు మూత్రం నమూనా ఇచ్చేందుకు నిరాకరించిన స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కొరడా ఝళిపించింది. అతడిని ఏకంగా నాలుగు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. జాతీయ జట్టుకు ఎంపిక పోటీల సందర్భంగా..టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజ్‌రంగ్ గత మార్చి 10న డోప్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే గడువు దాటిన కిట్లతో తన నమూనాను పరీక్షించే అవకాశముందని ఆందోళన వ్యక్తంజేస్తూ..అందుకు బజ్‌రంగ్ ససేమిరా అన్నాడు. దాంతో గత ఏప్రిల్ 23న నాడా అతడిని ప్రాథమికంగా సస్పెండ్ చేసింది. దరిమిలా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా పూనియాపై చర్య తీసుకుంది. తన సస్పెన్షన్‌పై నాడా క్రమశిక్షణ ప్యానెల్ వద్ద బజ్‌రంగ్ సవాల్ చేశాడు. విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ పూనియాను దోషిగా తేల్చింది.