బంగ్లా చారిత్రక విజయం
ABN , Publish Date - Aug 26 , 2024 | 05:32 AM
స్వదేశంలో రాజకీయ అస్థిరత..దేశం యావత్త్తూ అల్లకల్లోలం..ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్న తరుణం..ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన...
పది వికెట్లతో పాక్ చిత్తు
రావల్పిండి: స్వదేశంలో రాజకీయ అస్థిరత..దేశం యావత్త్తూ అల్లకల్లోలం..ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్న తరుణం..ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు తొలి టెస్ట్‌లో చారిత్రక విజయం అందుకుంది..పటిష్టమైన ప్రత్యర్థిని ఏకంగా పది వికెట్లతో చిత్తు చేసింది..రెండు మ్యాచ్‌ల వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటర్ ముష్ఫికర్ అద్భుత శతకంతో స్ఫూర్తి పొందిన బంగ్లా బౌలర్లు...ముఖ్యంగా స్పిన్నర్లు మెహ్దీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ప్రత్యర్థిని తిప్పేయడంతో పర్యాటక జట్టుకు అపురూప విజయం దక్కింది. ఓవర్‌నైట్ 23/1తో ఆదివారం, చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 146 పరుగులకే కుప్పకూలింది. కీపర్ రిజ్వాన్ (51), అబ్దుల్లా షఫిక్ (37) ఆదుకోకుంటే ఆతిథ్య జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
ఇక 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఏడు ఓవర్లలోనే బంగ్లాదేశ్ ఛేదించింది. ముష్ఫికర్ రహీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్ట్ ఈనెల 30 నుంచి ఇక్కడే జరగనుంది.
సంక్షిప్తస్కోర్లు: పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 448/6 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 565; పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 146 (రిజ్వాన్ 51, అబ్దుల్లా 37, మెహ్దీ హసన్ మిరాజ్ 4/21, షకీబ్ 3/44); బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 30/0 (జాకీర్ హసన్ 15 నాటౌట్, షాద్‌మన్ 9 నాటౌట్).