Share News

Baseball : బేస్‌బాల్‌ దేశంలో.. క్రికెట్‌కు దారి దొరికేనా?

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:11 AM

18వ శతాబ్దం మధ్య కాలంలో అమెరికాలో ఆదరణ పొందిన క్రికెట్‌ ఆ తర్వాతి కాలంలో కనుమరుగైంది. ఇప్పుడు మళ్లీ టీ20 వరల్డ్‌క్‌పతో క్రమంగా వేళ్లూనుకోవాలనుకొంటోంది. కానీ, బేస్‌బాల్‌ మేని యా నెలకొన్న అగ్రరాజ్యంలో

 Baseball : బేస్‌బాల్‌ దేశంలో.. క్రికెట్‌కు దారి దొరికేనా?

18వ శతాబ్దం మధ్య కాలంలో అమెరికాలో ఆదరణ పొందిన క్రికెట్‌ ఆ తర్వాతి కాలంలో కనుమరుగైంది. ఇప్పుడు మళ్లీ టీ20 వరల్డ్‌క్‌పతో క్రమంగా వేళ్లూనుకోవాలనుకొంటోంది. కానీ, బేస్‌బాల్‌ మేని యా నెలకొన్న అగ్రరాజ్యంలో మెగా ఈవెంట్‌తో క్రికెట్‌ ఏమేరకు యువతను ఆకర్షించగలుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత్‌ అనడంలో సందేహం లేకపోయినా.. అమెరికాలో కూడా క్రికెట్‌ విస్తరణకు భారీగా అవకాశాలున్నాయని ఐసీసీ లెక్కలేస్తోంది. యూఎ్‌సలో భారీగా క్రికెట్‌ అభిమానులున్నారని చెబుతోంది. అంతేకాకుండా 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం కూడా ఆట పాపులారిటీని పెంచే అవకాశం ఉంది. అందులోనూ ఈ వరల్డ్‌క్‌పనకు స్ర్పింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ను ప్రచారకర్తగా ఎంచుకోవడం కూడా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వ్యూహంలో భాగమే. యూఎ్‌సలో ముద్ర వేయగలిగితే.. విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ విస్తరణకు మార్గం మరింత సుగమమవుతుందన్నది ఐసీసీ ఆలోచన.

సుదీర్ఘకాలం తర్వాత..: పొట్టికప్‌లో భాగంగా అమెరికాలోని మూడు స్టేడియాలు న్యూయార్క్‌, డాలస్‌, ఫ్లోరిడాలో మొత్తం 16 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, 1844లో యూఎస్‌, కెనడా మధ్య న్యూయార్క్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. మళ్లీ 180 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌తో ఇక్కడ క్రికెట్‌ జోష్‌ కనిపించనుంది. ఒకానొక దశలో జెంటిల్మన్‌ క్రీడను అమెరికాలో విపరీతంగా ఆడేవారు. కానీ, 1860ల్లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా బేస్‌బాల్‌కు ఆదరణ పెరిగింది. అయితే, క్రికెట్‌ మూలాలున్న దేశాల వారు అమెరికాలో ఎక్కువగా స్థిరపడడం సానుకూలాంశం. అయితే, క్రికెట్‌ను కూడా బాస్కెట్‌బాల్‌, బేస్‌బాల్‌ తరహాలో కెరీర్‌గా మలచుకోవచ్చనే భరోసా యువతలో కలిగించగలిగితే చాలని ప్రస్తుత టోర్నీలో తలపడుతున్న యూఎస్‌ జట్టు స్నిన్నర్‌ నిసర్గ్‌ పటేల్‌ చెప్పాడు. ఈ క్రమంలో ఆటను మూలాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నాడు.

Updated Date - Jun 01 , 2024 | 05:11 AM