BCCI: పుకార్లకు చెక్.. కాన్పూర్ టెస్ట్ తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ABN , Publish Date - Sep 22 , 2024 | 02:37 PM
తొలి రోజు కాస్తంత కంగారు పెట్టిన బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.
తొలి రోజు కాస్తంత కంగారు పెట్టిన బంగ్లాదేశ్‌పై (Ind vs Ban) టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది (Kanpur Test Match). ఈ టెస్ట్ మ్యాచ్‌లో సీనియర్లకు విశ్రాంతిని ఇస్తారని జోరుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వార్తలకు తాజాగా బీసీసీఐ (BCCI) చెక్ పెట్టింది.
తొలి టెస్ట్ పూర్తయిన వెంటనే కాన్పూర్‌లో జరిగే రెండో టెస్ట్ గురించి ట్విటర్ ద్వారా కీలక ప్రకటన చేసింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుందని పేర్కొంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని బీసీసీఐ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్ విజయాల ఆధారంగానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే వీలుంటుందనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లు ఆడబోతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలో ఉండాలి. ఈ నేపథ్యంలో ఏ మ్యాచ్‌నూ తేలిగ్గా తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. కీలక టెస్ట్ సిరీస్‌లకు బంగ్లా సిరీస్‌ను సన్నద్ధంగా వాడుకోవాలని బీసీసీఐ అనుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..
Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..
Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..
Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..