390.. ఊదేశారు బెంగాల్ మహిళల జట్టు రికార్డు ఛేదన
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:01 AM
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా బెంగాల్ రికార్డు సృష్టించింది. తనుశ్రీ సర్కార్ (113), ప్రియాంక బాల (88 నాటౌట్) అదరగొట్టడంతో...
బెంగాల్ మహిళల జట్టు రికార్డు ఛేదన
రాజ్‌కోట్: మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా బెంగాల్ రికార్డు సృష్టించింది. తనుశ్రీ సర్కార్ (113), ప్రియాంక బాల (88 నాటౌట్) అదరగొట్టడంతో.. సీనియర్ మహిళల వన్డే టోర్నీలో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నిర్దేశించిన 390 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీతో మ్యాచ్‌లో నార్త్‌రన్ డిస్ట్రిక్స్ టీమ్ 309 పరుగుల లక్ష్య ఛేదన రికార్డును బెంగాల్ బద్దలుకొట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 305 పరుగుల లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో 389/5 స్కోరు చేసింది.
భారత జట్టులో చోటు కోల్పోయిన షఫాలీ వర్మ (197) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకొంది. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన బెంగాల్ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి గెలిచింది.